Begin typing your search above and press return to search.

డేంజర్: కరోనాతో కొత్తగా గుండె జబ్బులు!

By:  Tupaki Desk   |   2 Nov 2020 12:30 AM GMT
డేంజర్: కరోనాతో కొత్తగా గుండె జబ్బులు!
X
కరోనా వైరస్ సోకి తగ్గిపోయినా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లు మనిషిని కబళిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రధానంగా శ్వాసకోశాలకు సంబంధించినది కావడం వల్ల దాని ప్రభావం ఊపిరితిత్తులపైనా.. ఫలితంగా గుండెపైనా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే తాజా పరిశోధనలో కరోనా మహమ్మారి నేరుగా గుండె కండరాలపై కూడా దాడి చేసే అవకాశం ఉందని తేలింది. గుండె పనితీరును ఈ వైరస్ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.

కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. దీంతో గుండెకు సరిపడినంత ఆక్సిజన్ అందక దాని పనితీరు దెబ్బతింటుంది. గుండె లోపలి కణాల్లోనూ ప్రతి చర్యలు జరిగి మంటపుడుతుంది. తద్వారా గుండెజబ్బులు వచ్చే అవకాశముంటుంది.

తాజా పరిశోధనల ప్రకారం వైరస్ నేరుగా గుండెపైనే దాడి చేసే వీలుంది. మరోవైపు ఈ వైరస్ నేరుగా రక్తనాళాలపై దాడి చేయడం వల్ల రక్తం గడ్డం కట్టే ప్రమాదమూ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కొంతమంది కరోనా బాధితులను పరీక్షించగా వారి శరీరంలో చాలా చోట్ల రక్తం గడ్డకట్టినట్లు పరిశోధకులు గుర్తించారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనా వైరస్ పట్ల చాలా జాగ్రత్త వహించాలని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డా.సీన్ పిన్నేయ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో ప్రచురించామన్నారు.