Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుకు కొత్త తలనొప్పి.. కేజీ బేసిన్ కాలుష్యం

By:  Tupaki Desk   |   9 Sept 2020 12:15 PM IST
ఏపీ సర్కారుకు కొత్త తలనొప్పి.. కేజీ బేసిన్ కాలుష్యం
X
ఇప్పుడున్న తలనొప్పులు సరిపోవన్నట్లుగా తాజాగా ఏపీ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. కేజీ బేసిన్ లో తరచూ సంభవిస్తున్న చమురు పైపులైన్ల పేలుళ్లు.. లీకేజీ కారణంగా గోదావరి జిల్లాల పరిధిలో తరచూ ప్రాణ.. ఆస్తి నష్టాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా గోదావరి బేసిన్ లో కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన వెంకటపతిరాజా అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్ లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్.. కాలుష్య ప్రభావాన్ని అంచనా వేయాలని భావించింది. జస్టిస్‌ రామకృష్ణన్‌, సైబల్‌ దాస్‌ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వంతో పాటు క్రిష్ణా.. గోదావరి జిల్లాల కలెక్టర్లతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

గోదావరి బేసిన్ లో ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీతో పాటు రిలయన్స్ సంస్థ కూడా చమురును వెలికితీస్తోంది. దీని కారణంగా బేసిన్ లో కాలుష్యం అంతంతకూ పెరుగుతోంది. ఈ అంశంపై అధ్యయనం చేసి తమకు ఒక నివేదిక ఇవ్వాలని కోరింది. ఏపీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ట్రైబ్యునల్ ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు.. క్రిష్ణా.. గోదావరి జిల్లాల కలెక్టర్లతో పాటు ఆంధ్రా వర్సిటీ పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ను కూడా సభ్యుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.