Begin typing your search above and press return to search.

ఈట‌ల కోసం కొత్త‌ గేమ్ ... ఢిల్లీలో ఆ పార్టీ ఏం చేస్తోందంటే...

By:  Tupaki Desk   |   14 Aug 2021 9:00 AM IST
ఈట‌ల కోసం కొత్త‌ గేమ్ ... ఢిల్లీలో ఆ పార్టీ ఏం చేస్తోందంటే...
X
తెలంగాణ‌లో ఇప్పుడు అంద‌రి చూపు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఇలాకా అయిన హుజూరాబాద్ నియోజకవర్గంపై ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీజేపీ త‌ర‌ఫున మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ బ‌రిలో ఉండ‌గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇక అభ్య‌ర్థి ఖ‌రారు కంటే ముందే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట్ల‌ను ప్ర‌భావితం చేసేలా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న ద‌ళిత‌బంధు ప‌థ‌కం ప్ర‌క‌టించారు. అయితే, దీనికి కౌంట‌ర్‌గా బీజేపీ ఢిల్లీలో చ‌క్రం తిప్పుతోంది.

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఎస్సీ ఓట్ల‌ను టార్గెట్ చేసుకునే ద‌ళిత బంధు స్కీంను ప్ర‌వేశ‌పెట్టార‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే సాక్షాత్తు కేసీఆరే ఈ విష‌యాన్ని అంగీక‌రించారు. దీంతోపాటుగా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌కు ఎస్పీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. త‌ద్వారా హుజురాబాద్ లో ఉన్న ద‌ళితుల ఓట్లు త‌మ ఖాతాలో ప‌డేలా కేసీఆర్ గేమ్ ప్లే చేస్తున్నారు. అయితే, దీనికి కౌంట‌ర్‌గా బీజేపీ ఢిల్లీ కేంద్రంగా పావులు క‌దుపుతోంద‌ని అంటున్నారు.


మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎంఆర్‌పీఎస్‌) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఇటీవల ఢిల్లీలో కాలుకు శస్త్ర చికిత్స జ‌రిగింది. అయితే, మిగ‌తా పార్టీల సంగ‌తి అలా ఉంచితే ఆయ‌న్ను తెలంగాణ బీజేపీ ముఖ్య‌నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులను నుంచి మరింత సమాచారం తెలుసుకున్నారు. ఆయన్ను పరామర్శించిన వారిలో కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ స‌హా పార్టీ నేత‌లు ఉన్నారు. అయితే, ఈ ప‌రామ‌ర్శ వెనుక ద‌ళితుల ఓట్ల‌ను బీజేపీ ఖాతాలో ప‌డేలా మంద‌కృష్ణ‌తో గేమ్ ప్లే చేయ‌డ‌మ‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.