Begin typing your search above and press return to search.

ఎలక్ట్రికల్ కారు.. ఛార్జింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు

By:  Tupaki Desk   |   16 April 2021 3:00 PM IST
ఎలక్ట్రికల్ కారు.. ఛార్జింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు
X
ఇలాంటి కారు గురించి మీరెప్పుడూ విని ఉండరు. సంప్రదాయేతర ఇంధనంతో నడిచే కార్ల గురించి చాలానే విని ఉంటారు. ఆ కోవలో మొదటి వరుసలో ఉంటాయి ఎలక్ట్రికల్ కార్లు. అంతా బాగానే ఉంది కానీ.. ఛార్జింగ్ చేయాల్సి రావటమే ఈ కార్లకు ఉండే ప్రధాన లోపం. పరిమితంగా ఉండే ఛార్జింగ్ అనంతరం.. తప్పనిసరిగా ఛార్జింగ్ చేయాల్సిన రావటం.. ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండటం.. ఒకవేళ.. ఛార్జింగ్ చేయాల్సి వస్తే.. ఎక్కువ సమయం ఇంధనం కోసం వెయిట్ చేయాల్సిన రావటం పెద్ద సమస్య.

దీన్ని అధిగమించేందుకు అనేక కంపెనీలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటివేళ.. దీనికో అద్భుతమైన పరిష్కారాన్ని సిద్ధం చేసింది ఒక స్టార్ట్ అప్ కంపెనీ. ఎలక్ట్రికల్ కారే అయినప్పటికి.. సూర్యశక్తితో బ్యాటరీతో నడిచే ఈ కారు ఇప్పుడు సమ్ థింగ్ స్పెషల్ గా మారింది. ఎందుకంటే..ఈ కారును ప్రత్యేకంగా ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ కారును తయారు చేసింది అమెరికాకు చెందిన ‘ఆప్టెరా’ అనే కంపెనీ. పారాడిగ్మ్ అనే పేరుతో తయారు చేసిన ఈ సోలార్ ఎలక్ట్రికల్ కారు విశేషాల కుప్పగా చెప్పొచ్చు.

ఈ కారుకున్న మరో ప్రత్యేకత ఏమంటే కేవలం 3.5 సెకన్ల వ్యవధిలో ఈ కారు సున్నా నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ఠ వేగం గంటలకు 177కిలోమీటర్లు. ఒకసారి కారు ఫుల్ గా ఛార్జి అయ్యాక ఏకంగా 1600కి.మీ. నడిపే వీలుంది. చూసేందుకు ముంగిస ఆకారంలో ఉండే ఈ కారులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలుంది. రెండు మోడళ్లలో లభించే ఈ కారులో పారాడిగ్మ్ 29వేల డాలర్లు కాగా.. పారాడిగ్మ్ ప్లస్ 46,900 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పుడీ కారుకు పెద్ద ఎత్తున బుకింగ్స్ జరుగుతున్నాయి.