Begin typing your search above and press return to search.

నూతన విద్యా విధానం... 10వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్‌ తొలగింపు

By:  Tupaki Desk   |   2 March 2023 6:54 PM IST
నూతన విద్యా విధానం... 10వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్‌ తొలగింపు
X
పాఠశాల మరియు ఉన్నత విద్య విధానం లో సంస్కరణలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కొత్త జాతీయ విద్యా విధానం తో దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) లో భాగంగా 3 ఏళ్లు ప్రీ స్కూల్‌ మరియు 12 ఏళ్లు స్కూల్‌ ఉంటుంది.

కొత్త విధానంలో భాగంగా 4 ఏళ్ల వయసులో నర్సరీ లో విద్యార్థిని జాయిన్‌ చేయాల్సి ఉంటుంది. 5 ఏళ్ల వయసులో జూనియర్ కేజీ.. 6 ఏళ్ల వయసులో సీనియర్ కేజీ.. 7 ఏళ్ల వయసులో 1వ తరగతి... 8 ఏళ్ల వయసులో 2వ తరగతి లో విద్యార్థుల ఉండాల్సి ఉంటుంది. తప్పనిసరిగా వయసును పరిగణలోకి తీసుకోనున్నారు.

9 ఏళ్ల వయసు లో 3వ తరగతి.. 10 ఏళ్ల వయసు లో 4వ తరగతి.. 11 ఏళ్ల వయసు లో 5వ తరగతి ని విద్యార్థి చదవాల్సి ఉంటుంది. అలా 15 సంవత్సరాల వయసు లో 9వ తరగతి.. 16 ఏళ్ల వయసు లో 10వ తరగతి చదవాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా 10వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్‌ కాకుండా రెగ్యులర్ పరీక్ష విధానం ను అమలు చేయబోతున్నారు.

9వ తరగతి నుండి 12వ తరగతి వరకు కూడా సెమిస్టర్‌ విధానంను అమలు చేయబోతున్నారు. 12వ తరగతికి బోర్డ్‌ ఎగ్జామ్‌ ను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు స్కూల్‌ ఎడ్యుకేషన్ గా పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 10వ తరగతి తర్వాత 11 మరియు 12వ క్లాస్ లను ఇంటర్మీడియట్ గా పరిగణిస్తున్నారు.

కొత్త విధానంలో 12వ తరగతి తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ మరియు 4 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. గతంలో మూడు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే డిగ్రీ సర్టిఫికెట్‌ వచ్చేది. కానీ ఇప్పుడు 12వ తరగతి తర్వాత మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌.. రెండవ సంవత్సరం తర్వాత డిప్లొమా.. మూడవ సంవత్సరం కూడా పూర్తి చేస్తే డిగ్రీ పట్టా పొందవచ్చు.

మూడు సంవత్సరాల డిగ్రీ తర్వాత మరో ఏడాది కంటిన్యూ చేస్తే పీజీ కూడా పూర్తి అవుతుంది. నాలుగు ఏళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేస్తే నేరుగా పీ హెచ్‌ డి చేయవచ్చు. ఈ విధానంలో విద్యార్థులు మద్యలో చదువు ఆపేసినా కూడా అప్పటి వరకు సర్టిఫికెట్‌ ను పొందవచ్చు. డిగ్రీని ఏ సంవత్సరంలో ఆపేసి మరో కోర్సును చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ప్రాథమిక విద్య నుండి మొదలుకుని ఉన్నత విద్య వరకు అన్ని చోట్ల కూడా మార్పులు చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రతిభను మెరుగు పరచడం కోసం ఈ కొత్త విధానం ను అమలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.