Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ చికిత్సకు కొత్త మందు

By:  Tupaki Desk   |   2 Oct 2021 6:32 AM GMT
కరోనా వైరస్  చికిత్సకు కొత్త మందు
X
కరోనా వైరస్ పై చేస్తున్న యుద్ధానికి మాత్ర రూపంలో మరో ఆయుధం సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి . అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మెర్క్‌ రూపొందించిన మందు మాల్నుపిరవిర్‌ కరోనా వైరస్ పై పోరులో ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌ లో తేలింది. మొత్తం 775 మంది వాలంటీర్లపై ఈ మందుతో ప్రయోగాలు జరిపారు. కోవిడ్‌ సోకి అయిదు రోజులు గడిచిన రోగులకు ఈ మందును ఇచ్చి చూశారు. ఇతరులతో పోలిస్తే ఈ మందు తీసుకున్నవారు త్వరగా కోలుకోవడం, ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేకపోవడం, మరణాలు తక్కువగా నమోదవడం వంటి ఫలితాలు వచ్చాయన్నారు. అత్యవసర అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కరోనా వ్యాప్తి సుదీర్ఘకాలం కొనసాగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్‌ అధికారి పూనమ్‌ కేత్రపాల్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఒక సమూహంలో టీకాలు, గత ఇన్‌ ఫెక్షన్ల ఆధారంగా వృద్ధి చెందే ఇమ్యూనిటీ స్థాయిలను బట్టి దీర్ఘకాలంలో కరోనా ఎండమిక్‌ గా మారే అవకాశాలుంటాయన్నారు. వైరస్‌ అదుపులో మనిషి ఉండకుండా, మనిషి అదుపులో వైరస్‌ ఉండే పరిస్థితిన సాధించాలని సంస్థ దక్షిణాసియా డైరెక్టర్‌గా పనిచేస్తున్న సింగ్‌ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించిన ప్రాంతాల ప్రజలపై కరోనా ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేశారు. కోవాక్సిన్‌కు ఈయూఏ ఇవ్వడంపై మాట్లాడుతూ ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ సమర్పించిన గణాంకాల మదింపు జరుగుతోందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తికావచ్చని తెలిపారు.

కరోనా వైరస్ ను ప్రపంచం నుంచి పూర్తిగా తరిమివేయడం సాధ్యం కాకపోవచ్చని పూనమ్‌ అభిప్రాయపడ్డారు. అయితే కాలక్రమేణా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని, తద్వారా మరణాలను, ఆస్పత్రిపాలవడాన్ని, ఇతర నష్టాలను కనిష్టాలకు తీసుకురావచ్చని చెప్పారు. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ నుంచి రక్షణ బలహీనంగానే ఉందని, చాలామంది ప్రజలకు వైరస్‌ సోకే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అందుకే టీకా తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, గాలాడని ప్రాంతాల్లో గుమికూడడాన్ని తగ్గించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం తదితర చర్యలు కొనసాగించాలని గట్టిగా సూచించారు.థర్డ్‌ వేవ్‌ రాకడ, దాని బలం.. మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా సరైన చర్యలు పాటిస్తే మరో వేవ్‌ రాకుండా చూసుకోవచ్చన్నారు. అనేక దేశాల్లో టీకా లభించని ఈ తరుణంలో తిరిగి కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతి చేయాలన్న భారత్‌ నిర్ణయాన్ని స్వాగతించారు.

భారత్‌ లో శుక్రవారం 24,354 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 25,455 మంది కోవిడ్ నుంచి కోలుకోగా..234 మంది మరణించారు. కొత్త కేసులు వరుసగా 8వ రోజు 30వేల లోపే నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు భారీగా తగ్గడం శుభపరిణామం. గత ఆరు రోజులుగా యాక్టివ్ కేసు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు 197 రోజుల కనిస్టానికి చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు భారీగా తగ్గడం శుభపరిణామం. గత ఆరు రోజులుగా యాక్టివ్ కేసు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు 197 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. మన దేశంలో ఇప్పటి వరకు 3,37,91,061 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 3,30,68,599 మంది కోలుకోగా.. 4,48,573 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 2,73,889 యాక్టివ్ కేసులున్నాయి. కేరళలో నిన్న 13,834 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే దేశంలో నమోదైన కేసుల్లో సగానికిపైగా ఇక్కడే ఉన్నాయి. కేరళ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ 3,105 మందికి పాజిటివ్ వచ్చింది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 14,29,258 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉంది. గత 5 రోజులుగా 2శాతం కంటే తక్కువగానే నమోదవుతోంది.