Begin typing your search above and press return to search.
వైట్ హౌస్ విడుదల చేసిన నోట్ తో ట్రంప్ ఆరోగ్యంపై కొత్త సందేహాలు?
By: Tupaki Desk | 5 Oct 2020 10:45 AM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. అనూహ్యంగా రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు కరోనా పాజిటివ్ గా తేలటం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన సతీమణి మెలనియా సైతం పాజిటివ్ గా తేలటం తెలిసిందే. స్వల్ప అనారోగ్యంతో ఆమె బాధ పడుతుంటే.. ట్రంప్ కండీషన్ మాత్రం సీరియస్ గా ఉందంటున్నారు. కరోనా నుంచి ట్రంప్ త్వరగా కోలుకునేందుకు వీలుగా స్టెరాయిడ్స్ తో వైద్యం షురూ చేశారు.
ఇప్పటివరకు బయటకు వచ్చిన రిపోర్టల ప్రకారం ట్రంప్ ఆరోగ్యం బాగున్నట్లు చెబుతున్నా.. మరో 48 గంటలు గడిస్తే తప్పించి ఏమీ చెప్పలేమన్న మాట వినిపిస్తోంది. అనేకమంది కరోనా రోగుల మాదిరే ట్రంప్ ఆరోగ్యంలోనూ హెచ్చ తగ్గులు కనిపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ వారాంతంలో ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవటంతో ఆయనకు వైట్ హౌస్ లోనే ఆక్సిజన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
వైట్ హౌస్ తాజాగా విడుదల చేసిన మీడియా నోట్ ప్రకారం.. ట్రంప్ నకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. మరి.. ఆ మాటే నిజమైతే.. ఆయనకు అంత పవర్ ఫుల్ స్టెరాయిడ్స్ ఎందుకు ఇచ్చినట్లు? అన్న ప్రశ్నలకు సమాధానం లభించని పరిస్థితి. హెక్సామెథాసోన్ స్టెరాయిడ్ ను ట్రంప్ కు ఇచ్చారంటేనే.. ఆయన ఆరోగ్యం ఆందోళన కలిగించేలా ఉందన్న మాట వినిపిస్తోంది.
అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం కరోనా సీరియస్ రోగులకు తప్పించి స్వల్ప లక్షణాలు ఉన్న వారికి హెక్సా మెథాసోన్ స్టెరాయిడ్ ను ఇవ్వరాదు. ఇదిలా ఉంటే.. ప్రముఖ వైద్యులు డాక్టర్ సీన్ కాన్లే తాజాగా మాట్లాడుతూ.. ట్రంప్ ఆరోగ్యాన్ని తాము సమీక్షిస్తున్నామని.. ఆయన వైటల్స్ పరీక్షిస్తున్నామని.. సాచ్యురేషన్ పాయింట్ 96-98 గా ఉందని.. ఆయనకు ఆక్సిజన్ పెట్టలేదని చెప్పారు. ఆదివారం కూర్చొని ట్రంప్ పని చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ట్రంప్ ఆరోగ్యంపై విడుదలైన వైట్ హౌస్ నోట్ కు.. ఆయనకు అందుతున్న వైద్యానికి మధ్య అంతరం ఉందన్న మాట ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.