Begin typing your search above and press return to search.

రేవంత్ బ్యాచ్ లో ఈటెల..జూపల్లి..చందూలాల్ అండ్ కో

By:  Tupaki Desk   |   1 July 2016 6:43 AM GMT
రేవంత్ బ్యాచ్ లో ఈటెల..జూపల్లి..చందూలాల్ అండ్ కో
X
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటు. కొత్తగా వచ్చే వాటి సంగతేమో కానీ.. కొంత మంది నేతల స్థానాలు కదిలిపోవటం ఖాయమైంది. ఇలా కదిలిపోయే తమ స్థానాల గురించి అధికారపక్ష నేతలు కిమ్మనకుండా ఉంటే.. విపక్షాలు మాత్రం గగ్గోలు పెడుతున్న పరిస్థితి. రెండు రోజుల క్రితం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనను దెబ్బ తీసేందుకే తన నియోజకవర్గాన్నిరెండు జిల్లాల్లో ఉండేలా ప్లాన్ చేశారంటూ మండిపడ్డారు.

తనను ఏదో రకంగా దెబ్బ తీయాలన్న లక్ష్యంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ను రెండు జిల్లాల్లో ఉండేలా తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నినట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విన్న వారు అయ్యో.. రేవంత్ అనుకున్నారు. కానీ.. ఇలాంటిది ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే పరిమితం కాదని.. ఇలాంటి వారు రెండు డజన్ల వరకూ ఉన్నారు.

వీరిలో విపక్ష నేతలే కాదు.. అధికారపక్ష నేతలు.. టీఆర్ ఎస్ సర్కారులో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారూ ఉన్నారు. తనను టార్గెట్ చేసినట్లుగా చెప్పుకుంటున్న రేవంత్.. మరి మంత్రులు ఈటెల రాజేందర్.. జూపల్లికృష్ణారావు.. అజ్మీరా చందూలాల్ పరిస్థితి కూడా ఇదేనన్న విషయాన్ని ఎందుకు చెప్పుకోరు? పునర్విభజనలో తన నియోజకవర్గం గల్లంతు అవుతుందని గగ్గోలు పెడుతున్న రేవంతే ఇంతగా ఇదైపోతే.. మరి అధికార పార్టీలో కీలక నేతలుగా చెప్పుకునే వారు ఎంతలా ఫీల్ కావాలన్నది ప్రశ్న. కొత్త జిల్లాల కారణంగా మొత్తంగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలు గల్లంతు కానున్నాయి.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రేవంత్ లాంటి వారి నియోజకవర్గం రెండు జిల్లాల్లోకి వెళ్లిపోతే.. మరికొందరిది మాత్రం ఏకంగా మూడుముక్కలై.. మూడు జిల్లాల్లో వెళ్లిపోవటం గమనార్హం. కొత్త జిల్లాల కారణంగా 24 నియోజకవర్గాల రూపురేఖలు మారిపోతుంటే.. వీటిల్లో 17 జిల్లాలు రెండేసి నియోజకవర్గాల్లో ఉంటే.. ఏడు జిల్లాలు మాత్రం మూడు జిల్లాల్లో ఉండటం గమనార్హం.

మూడేసి జిల్లాల్లోకి వెళ్లే అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే..

= చొప్పదండి

= హుస్నాబాద్

= పాలకుర్తి

= జనగాం

= ఇల్లందు

= తుంగతుర్తి

= దేవరకొండ

రెండేసి జిల్లాల్లోకి వెళ్లే అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే..

% ఆసిఫాబాద్

% ఖానాపూర్

% మంథని

% మానకొండూరు

% వేములవాడ

% హుజురాబాద్

% ములుగు

% స్టేషన్ ఘన్ పూర్

% ఆందోల్

% దుబ్బాక

% గజ్వేల్

% నారాయణ ఖేడ్

% కొల్లాపూర్

% కల్వకుర్తి

% కొడంగల్

% ఎల్లారెడ్డి