Begin typing your search above and press return to search.

చైనాలో కొత్త వ్యాధి ... ముంచుకొస్తున్న మరో ముప్పు !

By:  Tupaki Desk   |   26 Sept 2020 1:20 PM IST
చైనాలో కొత్త వ్యాధి ... ముంచుకొస్తున్న మరో ముప్పు !
X
చైనా అంటేనే ఇప్పుడు ప్రపంచం యావత్తు భయపడుతున్నది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. కరోనా నుంచి ఇంకా ప్రపంచం కోలుకోలేదు. ఎప్పటి వరకు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి. కరోనా వైరస్ మహమ్మారిని అదుపు చేసేందుకు అనేక ఫార్మా కంపెనీలు, దేశాలు వాక్సిన్ ను తయారు చేసే పనిలో మునిగి ఉన్నాయి. క‌రోనావైర‌స్ ‌కు మూల బిందువుగా ఉన్న చైనా.. మ‌రో కొత్త వ్యాధి వ్యాప్తికి కూడా కార‌ణం అవుతోంది. ఇంత‌కు ముందు చైనాలోని వూహాన్లో పుట్టిన క‌రోనా వైర‌స్ అన్ని దేశాల‌కూ పాకింది. ఇప్పుడు వాయువ్య చైనాలో వేల మంది ఒక కొత్త ర‌కం వ్యాధి బారిన ప‌డుతున్నారు. బ్రుసెల్లా బ్యాక్టీరియా కార‌ణంగా వాయువ్య చైనాలో చాలామంది బ్రు‌సెల్లోసిస్ వ్యాధి బారిన ప‌డుతున్నారు.

గాన్సు ప్రావిన్స్ రాజ‌ధాని లాంజౌ న‌గ‌రం ఈ వ్యాధి వ్యాప్తికి మూలంగా ఉంది. ఇప్ప‌టికే 3,245 మంది ఈ వ్యాధి బారిన ప‌డిన‌ట్టు‌ నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ ఆఫ్ లాంజౌ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. ఈ వ్యాధి మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం, సరిగా వండని మాంసం తీసుకోవడం, సరిగా శుద్ధిచేయని పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, కలుషితమైన గాలిని పీల్చడం వలన ఈ వ్యాధి సోకుతుందని నిపుణులు చెప్తున్నారు. జాంగ్మూ లాంజౌ బయోఫార్మా కంపెనీ నుంచి ఈ బ్యాక్టీరియా బయటకు లీకైనట్టు అధికారులు చెప్తున్నారు.

బ్రుసెల్లస్ వ్యాధికి టీకాను తయారు చేసేందుకు చేస్తున్న పరిశోధన సమయంలో ఈ బ్యాక్టీరియా బయటకు లీకైనట్టు సమాచారం. అయితే, లీకైన బ్యాక్టీరియాను నిర్మూలించే సమయంలో తగిన ప్రమాణాలు పాటించకపోవడంతో ఇది ఇతరత్రా ప్రాంతాలకు వ్యాపించినట్టు సమాచారం. ఈ బ్యాక్టీరియా కరోనా వైరస్ కంటే సున్నితమైనదని, చాలా వేగంగా విస్తరిస్తుందని అధికారులు చెప్తున్నారు.బ్యాక్టీరియా గాలి ద్వారా మ‌నిషి శ‌రీరంలోకి వెళ్లిన‌ప్పుడు, పాడైపోయిన ఆహారం తీసుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఇది మ‌నుషుల‌కు వ్యాపిస్తుంది. లాంజౌ న‌గ‌రంలో ఇలానే బ్రుసెల్లోసిస్ వ్యాపించి ఉండొచ్చ‌ని నిపుణులు భావిస్తున్నారు. సెక్సువ‌ల్ కాంటాక్ట్, బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కూడా బ్యాక్టీరియా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకే అవ‌కాశం ఉంది. శ‌రీరంపై చిన్న‌పాటి గాయాలు ఉన్న‌వారు బ్యాక్టీరియా బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌.