Begin typing your search above and press return to search.

ఓ వైపు కరోనా.. ఏలూరులో వింతరోగం.. ఇవి చాలవన్నట్టు కేరళలో మరో వ్యాధి..!

By:  Tupaki Desk   |   12 Dec 2020 2:44 AM GMT
ఓ వైపు కరోనా.. ఏలూరులో వింతరోగం.. ఇవి చాలవన్నట్టు కేరళలో మరో వ్యాధి..!
X
ఈ 2020 విషాద ఏడాదిగా మిగిలిపోయింది. ఇప్పటికే కరోనాతో ప్రపంచం తలకిందులైన పరిస్థితి. ఇంకా కరోనా వ్యాక్సిన్​ విషయంలో క్లారిటీలేదు. ఎప్పుడొస్తుందో తెలియదు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులో ప్రజలు వింతవ్యాధి బారిన పడ్డారు. 600 మందికి ఈ వింత రోగం సోకింది. ముగ్గురు ప్రాణాలు పోయాయి. ఇంతవరకు ఈ రోగం మిస్టరీ వీడలేదు. కేంద్రబృందం ఈ వ్యాధి ఎలా సోకిందనే విషయంపై ముమ్మర పరిశోధన సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేరళ రాష్ట్రంలో వైద్యసిబ్బంది ఓ కొత్తరోగాన్ని గుర్తించారు. సౌత్​ ఆఫ్రికానుంచి ఈ వింతవ్యాధి కేరళకు వచ్చినట్టు సమాచారం.

కరోనా కూడా మొదట కేరళలోనే వెలుగుచూసింది. నిఫా వైరస్​కూడా అక్కడ తాజాగా కేరళలోని ఓ వ్యక్తి శరీరంలో వైద్యులు ప్లాస్మోడియం ఓవెల్​ ​ అనే పారాసైట్​ (పరాన్నజీవి) అవశేషాలు గుర్తించారట. ఈ పరన్నాజీవి దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చినట్టు సమాచారం. ఈ పరాన్నజీవి మన శరీరంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది. ఇది ప్రాణంతకమా కాదా అన్న విషయాలపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వ్యాధి పెద్దగా ప్రాణాంతకం కాకపోవచ్చని ఆమె చెప్పారు.

లక్షణాలు ఎలా ఏమిటి?

ఈ పరాన్నజీవి కనక మనశరీరంలోకి ప్రవేశిస్తే తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, అలసట, తీవ్రమైన చెమట, దగ్గు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరాన్నజీవి దోమల ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరాన్నజీవి మలేరియాను కలిగిస్తుంది. ఇప్పటికే మలేరియా ఆడ ఎనఫిలస్​ దోమల వల్ల వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్లాస్మోడియం ఓవెల్​ అనే పరాన్నజీవి వల్ల మనిషికి మలేరియా సోకే అవకాశం ఉన్నదట.

ప్లాస్మోడియం ఓవెల్​ అంటే ఏమిటో

ప్లాస్మోడియం ఓవెల్​ అనేది బ్యాక్టిరియా కంటే కఠినమైన నిర్మాణం ఉన్న ఓ ఏకకణ జీవి. ఇది ప్రొటోజోవా వర్గానికి చెందిన పరాన్నజీవి ఇది మనశరీరంలోకి వస్తే వెంటనే మలేరియా వస్తుంది. అయితే ఈ పరన్నాజీవి మనిషి శరీరంలోకి సోకినా అంత ప్రాణాంతకం కాదని వైద్యులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులను మెరుగైన వైద్యం చేయాలని వాళ్లు సూచిస్తున్నారు.