Begin typing your search above and press return to search.
ట్రాక్టర్లతో తొక్కించబోయారట.. అమరావతిలో కొత్త వివాదం
By: Tupaki Desk | 24 Oct 2020 10:30 AM ISTగడిచిన ఏడెనిమిది నెలలుగా అమరావతి ప్రాంతంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా దీక్ష జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా.. మూడు రాజధానులకు అనుకూలంగా దీక్షలు షురూ చేస్తున్నారు. ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక అంశంపై పోరాటం చేస్తున్న వేళ.. అదే అంశానికి సంబంధించి కౌంటర్ ఆందోళన చేయటంపై కొత్త తరహా ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి మంగళగిరిలోని కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకుంది.
మూడు రాజధానులకు అనుకూలంగా బహుజన పరిరక్షన సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. తాజాగా మంగళగిరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు ఆటోల్లో వెళుతుండగా.. క్రిష్ణాయపాలెంలో పలువురు అడ్డుకున్నారు. ఇలా అడ్డుకున్న వారిని టీడీపీ మద్దతుదారులుగా చెబుతున్నారు. రిలే దీక్షలకు వెళ్లే వారిలో ఉన్న మహిళల్ని ఉద్దేశించి మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
తమ భూముల్ని తీసుకొని పేదలకు ఉచితంగా ఇవ్వటం ఏమిటి? అంటూ వారు ఏపీ సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం వివాదంగా మారింది. మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళన కోసం వెళుతున్న చేస్తున్న వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. పోలీసు కేసుల వరకు వెళ్లింది. మూడు రాజధానులకు మద్దతు ఇచ్చే వారు.. వ్యతిరేకించే వారి మధ్య నెలకొన్న మాటల యుద్ధంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే.. తమపై దాడి చేసే ప్రయత్నం చేశారని.. వారంతా టీడీపీ నేతలుగా మూడు రాజధానులకు మద్దతు ఇచ్చేందుకు వెళుతున్న వారు పేర్కొన్నారు.
రిలే దీక్షలకు వెళుతున్న తమను.. ట్రాక్టర్లతో తొక్కిస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉద్రిక్తతల గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగి..ఇరు వర్గాల వారిని శాంతింపచేశారు. మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలకు వెళుతున్న వారిని అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఇదంతా చూసినప్పుడు.. రాజధాని వ్యవహరం స్థానికంగా కొత్త లొల్లిని తెర మీదకు తీసుకొచ్చిందని చెప్పక తప్పదు.