Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్న సీజేల బ్యాక్ గ్రౌండ్ ఇదేనట

By:  Tupaki Desk   |   16 Dec 2020 9:14 AM IST
రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్న సీజేల బ్యాక్ గ్రౌండ్ ఇదేనట
X
ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లుగా ఇద్దరుప్రముఖులు వస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ నిర్ణయం వెలువడనప్పటికీ.. అనధికారికంగా వారి ఎంపిక పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. వారిలో ఒకరు జస్టిస్ హిమా కోహ్లీ కాగా.. రెండోవారు జస్టిస్అరూప్ కుమార్ గోస్వామి. జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ సీజేగా వస్తుండగా.. మరొకరు ఏపీకి వస్తున్నారు.

ఎవరీ హిమా కోహ్లీ?
- సీనియార్టీ పరంగా చూస్తే.. ఢిల్లీ హైకోర్టులో రెండో స్థానంలో ఉన్నారు. పదోన్నతిపై ఆమె తెలంగాణకు వస్తున్నారు.

- 1959 సెప్టెంబరు రెండున ఢిల్లీలో పుట్టిన ఆమె.. ఢిల్లీ వర్సిటీలో ఎల్ఎల్ బీ పూర్తి చేశారు.

- న్యాయవాదిగా 1984లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె 2006లోఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు.

- 2007లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆమె.. అంతకు ముందు పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు.

- 2020లో ఢిల్లీ జ్యుడిషియల్ అకాడమీ ఛైర్ పర్సన్ గా నియమితులయ్యారు.

- కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీల రద్దీ తగ్గింపు కోసం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపర్ కమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.

- వాతావరణం.. పర్యావరణ సంరక్షణ.. కుటుంబ వివాదాల పరిష్కారంలో కీలకభూమిక పోషించినట్లు చెబుతారు.

- అనేక జాతీయ.. అంతర్జాతీయ సెమినార్లు.. సింపోజియంలలో పత్రాల్ని ప్రజెంట్ చేశారు.

ఏపీ సీజేగా వస్తున్న జస్టిస్ గోస్వామి ఎవరంటే?

- 1961 మార్చి 11న అసోంలో జన్మించిన గోస్వామి.. 1985లో గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి పట్టా పొందారు.

- న్యాయవాదిగా 1985లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. సివిల్.. క్రిమినల్.. రాజ్యాంగ.. ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్నమైన కేసులను వాదించారు.

- 2004 డిసెంబరులో గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ గా వ్యవహరించారు.

- 2011లో గువాహటి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా.. 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

- 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన ఆయన.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా వస్తున్నట్లు చెబుతున్నారు.