Begin typing your search above and press return to search.

అంతా ఏకమైయ్యారే.. ఇక అర్ధరాత్రి నుండి బాదుడే !

By:  Tupaki Desk   |   2 Dec 2019 6:00 AM GMT
అంతా ఏకమైయ్యారే.. ఇక అర్ధరాత్రి నుండి బాదుడే !
X
గత కొన్నిరోజుల నుండి తక్కువ ధరకే వాయిస్ కాల్స్, డేటా ఎంజాయ్ చేసిన కస్టమర్లకు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ షాకిచ్చాయి. జియో ఆరో తేది నుంచి, మిగతా రెండు కంపెనీలు 3వ తేదీ నుంచి టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించాయి. టెలికం ఇండస్ట్రీలో దాదాపు అతిపెద్ద పెంపుగా భావిస్తున్నారు. కంపెనీలు ఏకంగా 40 శాతానికి పైగా టారిఫ్ పెంచుతున్నాయి. గత కొన్నిరోజుల క్రితం వరకు ఒకటే పోటీ. జియో ఫ్రీ అంటూ రావడంతో జియోకి పోటీగా ఎయిర్ టెల్ చార్జీలు తగ్గిస్తే, ఆ రెండింటికి పోటీగా వోడాఫోన్, ఐడియా చార్జీలు తగ్గించాయి. దీంతో వినియోగదారుడు బాగా లాభపడ్డాడు. తక్కువ ధరకే డేటా, కాల్ చార్జీలు పొందాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ధరలు పెంచక తప్పదని ఐడియా-వోడాఫోన్ ప్రకటించగా ..అవును అంటూ వారికి మద్దతు తెలిపింది ఎయిర్ టెల్. ఈ నేపథ్యంలో స్థిరీకరణలో భాగంగాత్వరలో మేము చార్జీలు పెంచుతామంటూ జియో కూడా ప్రకటించింది. ఇలా దాదాపు నెల రోజులుగా లీకులిస్తున్న ఈ సంస్థలన్నీ ఎట్టకేలకి ధరలు పెంచబోతున్నట్టు ప్రకటించేసాయి. పెరిగిన చార్జీలు ఈ రోజు అర్థరాత్రి నుంచే అమల్లోకి రాబోతున్నాయి.

ఏ ప్లాన్ కు ఎంత పెరిగిందనేది చూడటం కొంచెం కష్టం కానీ ... ఇప్పటివరకు మీరు రీచార్జ్ కోసం వంద రూపాయలు కేటాయిస్తే.. ఇక నుంచి అదే రీచార్జ్ కోసం 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ప్రతి రీచార్జ్ మీద 40 నుంచి 50 రూపాయలు పెంచేసాయి. వాలిడీటీ, డేటా లిమిట్ తో సంబంధం లేకుండా అన్ని నెట్ వర్క్ చార్జీలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. అలాగే చార్జీలు పెంచినందుకు తమ కస్టమర్స్ ని ఆకర్షించడానికి దానికి బదులుగా డేటాను కూడా పెంచాయి. ప్రస్తుతం ఉన్న ప్లాన్స్ లో ఎంత డేటా లిమిట్ ఉందో, అంతకంటే కాస్త ఎక్కువ లిమిట్ ను ఇవ్వబోతున్నాయి. ఇకపోతే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..గతంలోలాగా ఉచితంగా ఇన్-కమింగ్ కూడా ఉచితంగా రాదు. ప్రతి నెల కనీసం 49 రూపాయలతో రీచార్జ్ చేయించుకుంటేనే ఇన్-కమింగ్ కాల్స్ వస్తాయి లేదంటే సిమ్ బ్లాక్ అయిపోతుంది.