Begin typing your search above and press return to search.

ఇది తెలుసా.. ఆడోళ్లు ఒక్కరే ఉండటానికే ఇష్టపడుతున్నారట

By:  Tupaki Desk   |   8 July 2020 7:00 AM IST
ఇది తెలుసా.. ఆడోళ్లు ఒక్కరే ఉండటానికే ఇష్టపడుతున్నారట
X
కాలం మారింది. ఆలోచనలు మారుతున్నాయి. బతికే తీరులోనూ మార్పు వచ్చేసింది. వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికి ఇది నిజం. కొద్ది కాలం క్రితం చేసిన ఒక అధ్యయనంలో కొత్త విషయాన్ని గర్తించారు. 2018 శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం ఒంటరిగా ఉండేందుకు ఆడవారు ఇష్టపడుతున్నారట. ఇలాంటివారి సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. గణాంకాలు చెబుతున్న వివరాలు అంచనాకు మించి ఉండటమే.

భర్త చనిపోవటం కానీ.. విడాకులు తీసుకోవటం కానీ.. విడాకులు లేకుండా ఎవరి బతుకువారు బతకాలన్న ఆలోచనలో ఉండే మహిళలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారట. పాత బంధం తాలుకూ గాయం వారిని వేధిస్తోందట. అందుకే..కొత్త బంధాలకు ముడి పడటం ఇష్టం లేక తమ బతుకు తాము బతకాలన్న ఆలోచనలు పెరుగుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుందట.

కారణాలు ఏమైనా వివాహం తర్వాత విడిగా ఉంటున్న మహిళలు దేశంలో దక్షిణాదిన ఎక్కువగా ఉంటున్నారట. అందునా కేరళ.. తమిళనాడులో ఈ సంఖ్య మరింత ఎక్కువని చెబుతున్నారు. కేరళ లో ఒంటరి గా ఉండే మహిళలు 9.3 శాతం అయితే.. తమిళనాడులో 9.1 శాతంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తక్కువేం కాదు. ఏపీ లో 7.8 శాతం ఉంటే.. తెలంగాణ లో 7.1 శాతంగా ఉంది. అదే సమయం లో పెళ్లి తర్వాత విడి గా ఉండే మగాళ్లు మాత్రం కేవలం 1.5 శాతం మందేనట. అంటే.. వివాహ బంధం తర్వాత విడిగా ఉండేందుకు మహిళలు ఆసక్తి చూపించకుండా ఉంటే.. పురుషులు మాత్రం అందుకు భిన్నం గా ఏదో ఒక తోడు వెతుక్కోవటం కనిపిస్తుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒకే ఇంట్లో ఉండే భార్య భర్తలు ఎవరికి వారు గా ఉండటం ఈ మధ్యన ఎక్కువైందని చెబుతున్నారు. ఫ్యామిలీ కమిట్ మెంట్స్.. సంఘం లో తమకుండే గౌరవ మర్యాదల విషయం లో లోటు రాకుండా ఉండేందుకు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా.. వారు మాత్రం విడి గా ఉంటారట. ఇలాంటి వారిని లెక్క పెడితే.. అంకెలు భారీగా ఉంటాయని చెబుతున్నారు. గతం లో కేరళ లో మాత్రమే ఒంటరి మహిళలు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడది దక్షిణాదిన పెరిగింది. అందుకు భిన్నం గా ఉత్తరాదిన మాత్రం ఉండటం గమనార్హం.