Begin typing your search above and press return to search.

క‌ర‌ణానికి కొత్త స‌వాల్‌.. ప‌రుచూరా? చీరాలా?

By:  Tupaki Desk   |   21 Sep 2021 4:30 AM GMT
క‌ర‌ణానికి కొత్త స‌వాల్‌.. ప‌రుచూరా?  చీరాలా?
X
టీడీపీ మాజీ సీనియ‌ర్ నాయ‌కుడు.. దాదాపు 40 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుడు.. క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తి. ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పిన‌.. ఆయ‌న దూకుడు.. వివాదాల‌కు.. నోటి దురుసు త‌నానికి పెట్టింది పేర‌ని అంటారు. పార్టీ ఏదైనా.. నాయ‌కులు ఎవ‌రు ఉన్నా.. త‌న శైలిని తానుకొన‌సాగించే.. క‌ర‌ణం.. టీడీపీకి వీర విధేయులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు క‌దా.. అలాగే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో చీరాల నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న త‌ర్వాత‌.. అనూహ్యంగా పార్టీ మారి.. వైసీపీ పంచ‌న చేరారు.

అయితే.. ఇదంతా రాజ‌కీయ స్టంటేన‌ని.. త‌న‌పై ఉన్న కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు క‌ర‌ణం ఇలా చేశార‌నే ప్ర‌చారం ఉంది. ఇదిలావుంటే.. చీరాల‌లో అప్ప‌టికే ఉన్న యువ నాయ‌కుడు.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌తో క‌ర‌ణం విభేదిస్తున్నారు. ఇది రోడ్డున‌ప‌డి.. ఇరువురు నేత‌ల మ‌ధ్య స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు కూడా చోటు చేసుకున్నాయి. చీరాల‌లో మంచి ప‌ట్టు.. మాస్‌లో మంచి.. ఫాలోయింగ్ ఉన్న ఆమంచి.. 2019 ఎన్నిక‌ల్లో ఓడిన త‌ర్వాత కూడా.. ప్ర‌జ‌లకు చేరువ‌గానే ఉంటున్నారు. మ‌రోవైపు.. క‌ర‌ణం.. చీరాల‌లో మ‌రో గ్రూపు న‌డిపిస్తున్నారు. దీంతో వీరి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విభేదాలు న‌డుస్తున్నాయి.

దీంతో వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో చీరాల‌లో ఎవ‌రికి టికెట్ ఇస్తారు..? అనేది వైసీపీలో కొన్నాళ్లుగా జ‌రుగుతున్న కీల‌క చ‌ర్చ‌. చీరాల అనేది ఆమంచికి క‌లిసి వ‌చ్చిన నియోజ‌వ‌క‌ర్గం.. పైగాకాపులు, ఇత‌ర బీసీ కులాలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. దీంతో ఇక్క‌డ నుంచే తాను పోటీ చేస్తాన‌ని ఆమంచి చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర‌ణంను.. పొరుగున ఉన్న ప‌రుచూరు నుంచి పోటీ చేయాల‌నేది .. వైసీపీ ఆలోచ‌న‌. దీనిపై ఇప్ప‌టికే క‌ర‌ణానికి కూడా స‌మాచారం పంపారు. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా `మీరు ప‌రుచూరు వెళ్లండి అన్న‌!` అని చెప్పిన‌ట్టు తెలిసింది.

కానీ, ఎవ‌రు ఎన్ని చెప్పినా.. చీరాల‌, అద్దంకి నియోజ‌క‌వ‌ర్గాల‌ను వ‌దులుకునే ప్ర‌స‌క్తి లేద‌ని.. క‌ర‌ణం గ‌ట్టిగానే చెబుతున్నారు. దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి త‌న సొంత జిల్లాలోనే ఉన్న‌ప్ప‌టికీ.. కేవ‌లం చీరాల‌, అద్దంకి వ‌ర‌కే క‌ర‌ణం ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఇప్పుడు ప‌రుచూరుకు వెళ్లి.. అక్క‌డివారిని త‌న‌వైపు తిప్పుకోవాలంటే.. స‌మ‌యం ప‌డుతుంద‌ని.. సాధ్యం కూడా కాక‌పోవ‌చ్చ‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అంతేకాదు.. ప‌రుచూరులో టీడీపీ నాయ‌కుడు.. గ‌త జ‌గ‌న్ సునామీలోనూ త‌ట్టుకుని గెలిచిన ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు.. బ‌లంగా ఉండ‌డం.. కూడా క‌ర‌ణం.. ఈ నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తి చూడ‌నీ య‌డం లేద‌ని అంటున్నారు. కానీ, చీరాల‌లో ఆమంచి ప‌ట్టు ముందు.. ఈ ద‌ఫా.. క‌క‌ర‌ణం గెల‌వ‌లేర‌నే సంకేతాలు వ‌స్తుండ‌డం.. మ‌రోవైపు సాక్షాత్తూ ముఖ్య‌మంత్రి కూడా ప‌రుచూరుకు వెళ్లాల్సిందేన‌ని చెబుతుండ‌డం వంటివి.. క‌ర‌ణంకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.