Begin typing your search above and press return to search.

ఇదేం ప్లానింగ్‌?: ఛాంబ‌ర్ల కోసం 15 రోజులు

By:  Tupaki Desk   |   3 April 2017 7:24 AM GMT
ఇదేం ప్లానింగ్‌?: ఛాంబ‌ర్ల కోసం 15 రోజులు
X
త‌నంత మొన‌గాడు భూప్ర‌పంచంలో లేర‌న్న‌ట్లుగా మాట‌లు చెబుతుంటారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. త‌న దూర‌దృష్టి గురించి ఆయ‌న నిత్యం గొప్ప‌లు చెప్పుకుంటారు. అదేమంటే.. అప్పుడెప్పుడో జ‌రిగిపోయిన బిల్ గేట్స్ ముచ్చ‌ట మొద‌లు.. ఫైళ్లు ప‌ట్టుకొని అమెరికాకు వెళ్లి హైద‌రాబాద్ కు ఐటీ కంపెనీలు తీసుకొచ్చిన రామాయ‌ణాన్ని చెప్పుకొస్తారు. బాబు చేసింది త‌ప్ప‌ని చెప్ప‌టం లేదు. తాను చేసిన ప‌నుల గురించి గొప్ప‌లు చెప్పుకోవ‌టం కూడా త‌ప్పు కాదు. స‌మ‌స్య ఏమిటంటే.. అప్పుడెప్పుడో చేసిన ప‌నుల గురించి ఇప్పుడు గొప్ప‌లు చెప్పుకోవ‌టం.. అదే ప‌నిగా చెప్పుకోవ‌టంతోనే అస‌లు స‌మ‌స్య‌. నిజానికి బాబు కానీ చ‌క్క‌టి విజ‌న‌రీ అయి ఉంటే.. హైద‌రాబాద్ బాగా డెవ‌ల‌ప్ అయిపోయి.. రాష్ట్రం విడిపోతే.. అప్పుడు ఆంధ్రా ప‌రిస్థితి ఏమిట‌న్న ఆలోచ‌న చేసి.. అందుకు త‌గ్గ‌ట్లుగా ప్లాన్లు సిద్ధం చేసి ఉంటే.. ఏపీకి ఈరోజు ఉన్న దుస్థితి ఉండేది కాదు.

మిగిలిన ప్రాంతాల్ని వ‌దిలేసి.. హైద‌రాబాద్ మీద‌నే ఫోక‌స్ అంతా పెట్టిన బాబు పుణ్య‌మా అని.. ఈ రోజు ఏపీకి ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యాన్ని అవున‌న్నా.. కాద‌న్నా ఒప్పుకోవాల్సిందే. ఈ పాత ముచ్చ‌ట్ల‌ను కాసేపు ప‌క్క‌న పెట్టేసి.. వ‌ర్త‌మానానికి వ‌స్తే.. బాబు ప్లానింగ్ ఎంత దారుణంగా ఉంద‌న్న విష‌యం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

నిన్న జ‌రిగిన మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణలో భాగంగా కొత్త‌గా 11 మంది మంత్రుల్ని క్యాబినెట్ లోకి తీసుకోవ‌టం తెలిసిందే. అయితే.. వీరిలో చాలామందికి ఛాంబ‌ర్లు లేని ప‌రిస్థితి. మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత‌.. అమాత్యులుగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌టానికి ఛాంబ‌ర్ల కోసం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి. కొత్త మంత్రుల‌కు అవ‌స‌ర‌మైన ఛాంబ‌ర్ల‌ను సిద్ధం చేయ‌టానికి క‌నీసం రెండు వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌న్న‌ది ఇవాల్టి ముచ్చ‌ట కాదు. కొన్ని నెల‌లుగా అనుకుంటున్న‌దే. ఇక‌.. ముఖ్య‌మంత్రే విస్త‌ర‌ణ ఉంటుంద‌ని.. నారా లోకేశ్ ను మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటున్న‌ట్లు స్వ‌యంగా చెప్పిన త‌ర్వాత కూడా.. మంత్రుల‌కు అవ‌స‌ర‌మైన ఛాంబ‌ర్లు ఏర్పాటు చేయ‌లేదంటేనే.. పాల‌న మీద బాబు ప‌ట్టు ఎంత త‌గ్గింద‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది. త‌న టీం మెంబ‌ర్లకు అవ‌స‌ర‌మైన ఛాంబ‌ర్ల‌ను ముంద‌స్తుగానే సిద్ధం చేయించ‌లేని చంద్ర‌బాబు.. ఆయ‌న అధికార గ‌ణం న‌వ్యాంధ్ర ఫ్యూచ‌ర్‌కు అవ‌స‌ర‌మైన ప్లానింగ్ చేయించే స‌త్తా ఉందంటారా? అన్నది అస‌లు డౌట్‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/