Begin typing your search above and press return to search.

మ‌న బుల్లెట్ ట్రైన్ లో ఉండే వ‌స‌తులెన్నో

By:  Tupaki Desk   |   12 Jun 2017 6:19 AM GMT
మ‌న బుల్లెట్ ట్రైన్ లో ఉండే వ‌స‌తులెన్నో
X
ప్ర‌పంచంలోని ప‌లుదేశాల్లో బుల్లెట్ ట్రైన్లు ఉన్నా.. ఇప్ప‌టికీ మ‌న‌కు ఆ అదృష్టం లేదు. బుల్లెట్ ట్రైన్ క‌ల‌ను సాకారం చేసేందుకు మోడీ స‌ర్కారు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా ముంబ‌యి నుంచి 508 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే అహ్మ‌దాబాద్ కు కేవ‌లం 2 గంట‌ల వ్య‌వ‌ధిలో చేరుకునే ఈ ట్రైన్ ను కొన్నేళ్ల‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఈ ట్రైన్ కోసం దేశం ఎంతో ఉత్కంట‌తో ఎదురుచూస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ బుల్లెట్ ట్రైన్ ప్ర‌యాణించే మార్గం ఎక్కువ భాగం ఎత్తైన వంతెన మాదిరి ఉంటుంద‌ని.. 21 కిలోమీట‌ర్ల మాత్రం భూగ‌ర్భంలో.. ఏడు కిలోమీట‌ర్లు స‌ముద్ర గ‌ర్భంలో ఉంటుంద‌ని చెబుతున్నారు. ముంబ‌యిలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్ లోని భూగ‌ర్భంలో నుంచి మొద‌ల‌య్యే ఈ ట్రైన్ 21 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించిన త‌ర్వాత‌నే ఠానే వ‌ద్ద భూమి మీద‌కు వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ట్రైన్లో కోచ్ ల‌లో ఉండే వ‌స‌తుల గురించిన డిటైల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. స్టార్ హోట‌ళ్ల‌లో ఉండే చాలా వ‌స‌తులు ఈ ట్రైన్లో ఉండ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జ‌పాన్ నుంచి భార‌త్ అప్పు తీసుకోనుంది. దాదాపు 25 బుల్లెట్ రైళ్ల‌ను భార‌తీయ రైల్వే కొనుగోలు చేయ‌నుంది. ఇందుకు రూ.5 వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్య‌యంలో 81 శాతాన్ని పైసా వ‌డ్డీకి జ‌పాన్ మ‌న‌కు రుణంగా ఇవ్వ‌నుంది. ఈ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మ‌య్యే నిధుల్ని భార‌తీయ రైల్వేల‌తో పాటు.. మహారాష్ట్ర.. గుజ‌రాత్ ప్ర‌భుత్వాలు స‌మ‌కూర్చ‌నున్నాయి.

ఇక‌.. ఈ రైల్లో ఉండే వ‌స‌తులు చూస్తే..

- పురుషుల‌కు.. స్త్రీల‌కు వేర్వేరుగా టాయిలెట్లు

- మూడు వైపులా అద్దాలు

- పిల్ల‌లు చేతులు క‌డుక్కోవ‌టానికి వీలుగా వారి ఎత్తులో నిర్మించే వాష్ బేషిన్లు

- ప్ర‌యాణంలో చంటిపిల్ల‌ల‌కు పాలు ఇచ్చేందుకు త‌ల్లుల‌కు ప్ర‌త్యేక‌మైన గ‌ది

- దివ్యాంగులు చ‌క్రాల కుర్చీల‌తో స‌హా రైల్లోకి వెళ్లే స‌దుపాయం

- వేడి నీటి సౌక‌ర్యం

- పిల్ల‌ల దుస్తులు మార్చ‌టానికి వీలుగా ఏర్పాటు

- అనారోగ్యంతో బాధ ప‌డే ప్ర‌యాణికుల‌కు అవ‌స‌ర‌మైన మందులు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/