Begin typing your search above and press return to search.
కరోనా చాలదన్నట్టు మరో రోగం.. వైద్యుల వార్నింగ్
By: Tupaki Desk | 20 Dec 2020 10:30 AM ISTఎక్కడి నుంచి వచ్చిందో ఈ మహమ్మారి కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికీ తగ్గకుండా ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఆ వ్యాధికి మందు లేకుండా.. చికిత్స లేకపోవడంతో కానకష్టం అవుతోంది. యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది.
ఈ సమస్యలు చాలవన్నట్టు మరో కొత్త సమస్య ముంచుకొస్తోంది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో కొత్తగా మరో బ్యాక్టీరియా కలకలం రేపుతోంది.
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో కొత్తగా ప్రాణాంతక బ్యాక్టీరియా మనుషుల ప్రాణాలు తీస్తోంది. కొత్తగా వెలుగు చూసిన ఈ వ్యాధి ప్రజల్లో భయాందోళనకు కారణమవుతోంది. ఈ బ్యాక్టీరియాను ‘షిగెల్లా’ గా పిలుస్తున్నారు.
ఈ బ్యాక్టీరియా కారణంగా ఇన్‌ఫెక్షన్‌కు గురైన 11 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. అంతేకాదు.. అతనితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా అస్వస్థత బారిన పడ్డారని వైద్యులు వెల్లడించారు. బాధిత బాలుడితో కలిసిమెలిసి ఉన్న దాదాపు 20 మంది జ్వరం, అతిసారం, కడుపులో తిప్పడం వంటి ఇతర సమస్యలతో ఆస్పత్రుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. వీరి అనారోగ్యానికి బ్యాక్టీరియానే కారణం అని తేల్చారు.
కేరళ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. బాలుడి స్వగ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ పరీక్షలు జరుపుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.