Begin typing your search above and press return to search.
మొబైల్ యాప్స్ వాడుతున్నారా? కొత్త వైరస్ అటాక్
By: Tupaki Desk | 4 Jan 2018 4:03 PM ISTడిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో మొబైల్ బ్యాంకింగ్ పై ఎక్కువ మంది ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకు సేవలకు మరింత సులభతరం చేసేందుకు ఈ రకంగా ముందుకు సాగుతున్నారు. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై మొబైల్ బ్యాంకింగ్ యాప్ లను ఎక్కువగా వాడుతుంటే జాగ్రత్త ఉండాలని అంటున్నారు. ఎందుకంటే ఓ సరికొత్త మాల్ వేర్ వైరస్ ఇప్పుడు మన దేశంలో ఉన్న అనేక బ్యాంకులకు చెందిన ఆండ్రాయిడ్ యాప్ లకు వ్యాప్తి చెందుతోంది.
`Android.banker.A9480` అనే పేరుగల ఈ మాల్ వేర్ తాజాగా సమస్యలను తెచ్చిపెడుతోందట. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఓపెన్ చేసే పలు సైట్లు - ఇన్ స్టాల్ చేసుకునే యాప్స్ ద్వారా వారికి తెలియకుండానే ఈ మాల్ వేర్ కు చెందిన యాప్ యూజర్ల ఫోన్లలో ఇన్ స్టాల్ అవుతుంది. అనంతరం యూజర్ల ఫోన్లలో ఉండే కాల్ లాగ్స్ - ఎస్ ఎంఎస్ లు, కాంటాక్ట్ లిస్ట్ ను డౌన్ లోడ్ చేసి హ్యాకర్లకు పంపిస్తుంది. అంతేకాకుండా ఓటీపీ అక్కర్లేకుండానే బ్యాంకింగ్ యాప్ లలోకి లాగిన్ అయి డబ్బులను హ్యాకర్ లకు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. మన దేశంలో యూజర్లు వాడుతున్న ప్రధాన బ్యాంక్ లకు చెందిన ఆండ్రాయిడ్ యాప్ లకు పైన చెప్పిన మాల్ వేర్ వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపింది.
యాక్సిస్ మొబైల్ - హెచ్ డీఎఫ్ సీ మొబైల్ బ్యాంకింగ్ - ఎస్ బీఐ ఎనీవేర్ పర్సనల్ - హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ లైట్ - ఐసీఐసీఐ ఐమొబైల్ - ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్ ప్లస్ - ఐడీబీఐ బ్యాంక్ అభయ్ - ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్ - ఐబీడీఐ బ్యాంక్ ఎంపాస్ బుక్ - బరోడా ఎంపాస్ బుక్ - యూనియన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ - యూనియన్ బ్యాంక్ కమర్షియల్ క్లైంట్స్ తదితర 232 మొబైల్ బ్యాంకింగ్ యాప్ లకు ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందని సెక్యూరిటీ సంస్థ క్విక్ హీల్ వెల్లడించింది. అందుకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ మాల్ వేర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వెంటనే సరైన యాంటీ వైరస్ ప్రొటెక్షన్ ను ఏర్పాటు చేసుకోవాలని - యాప్ లకు లాక్ లు - పాస్ వర్డ్ లు పెట్టుకోవాలని, వీలుంటే డివైస్ లను మొత్తం ఒకసారి యాంటీ వైరస్ స్కాన్ చేయాలని సూచిస్తోంది.