Begin typing your search above and press return to search.
కరోనా వేళ.. ఇంత ఖరీదైన పెళ్లిని ఇప్పటివరకు విని ఉండరు
By: Tupaki Desk | 8 Oct 2020 7:00 AM ISTప్రపంచ గతినే కాదు.. ప్రజల జీవన విధానాల్ని పూర్తిగా మార్చేసింది కరోనా. మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. ప్రభుత్వాలు విధించిన పరిమితుల నేపథ్యంలో పెళ్లిళ్లు.. శుభకార్యాలు సింఫుల్ గా చేసుకోవటం తెలిసిందే. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లిని.. ఎలా చేసుకోవాలన్న దానిపై ఎవరికి వారు బోలెడన్ని కలలు ఉంటాయి. కానీ.. అలాంటి వాటికి అవకాశం లేకుండా చేసిన కరోనాతో చాలా జంటలుతమ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నాయి.
సంపన్నులు.. అపర కుబేరులైతే.. ఎంతో ఘనంగా చేయాలనుకున్న పెళ్లి వేడుకల్ని ఏమీ చేయలేక వేదన చెందుతున్నారు. ఏదో రెండు.. మూడు నెలలు ఉండి పోతుందని భావించిన కరోనా మీద ఇప్పుడిప్పుడే క్లారిటీ పెరుగుతోంది.వచ్చే ఏడాది మధ్య వరకు కరోనా ప్రభావం ఉంటుందన్న విషయంపై క్లారిటీ వచ్చాక.. ప్రభుత్వ పరిమితుల మధ్య వినూత్నంగా పెళ్లి చేసుకునేందుకు వీలుగా కొత్త కాన్సెప్టుల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు.
తాజాగా అలాంటి పెళ్లే ఒకటి లండన్ లోని సౌత్ గేట్ లో జరిగింది. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిగా దీన్ని చెబుతున్నారు. అంతేనా.. వినూత్నంగా ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు. లండన్ లోని నిబంధనల ప్రకారం పెళ్లికి 30 మందికి మించి ఆహ్వానించకూడదు. తాజాగా పెరిగిన కేసులతో దాన్ని 15కు తగ్గించారు. దీంతో.. పక్కాగా రూల్ ప్రకారం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ప్రేమ జంట రోమా పోపట్.. వినాల్ పటేల్ వెరైటీగా ప్లాన్ చేశారు.
ఇందుకోసం ఎస్సెక్స్ లోని 500 ఎకరాల గ్రౌండ్ ను పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. పెళ్లి కోసం 250 మంది.. తమకు అత్యంత సన్నిహితులు.. బంధువుల్ని ఎంపిక చేసుకున్నారు. ఆన్ లైన్ లో ఇన్విటేషన్ కార్డులు పంపారు. చేతులు శుభ్రం చేసుకోవటానికి నాప్ కిన్స్.. శానిటైజర్లను పంపారు. వాటితో పాటు.. రుచికరమైన స్నాక్స్ పంపారు. పెళ్లి జరిగే గ్రౌండ్ లో ఏమేం చేయాలో.. చేయకూడదో వివరాలు పంపారు.
పెళ్లికి వచ్చినోళ్లంతా ఖరీదైన ఆడిస్.. ల్యాండ్ రోవర్.. లంబోర్గిని లాంటి విలాసవంతమైన కార్లలో వచ్చారు. ముందు అనుకున్నట్లు.. ఏ ఒక్కరూ తమ కార్లలో నుంచి కిందకు దిగలేదు. గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ల మీద పెళ్లి కార్యక్రమాన్ని చూడసాగారు. వేదిక మీద కొత్త జంటతో పాటు పదిహేను మందికే పరిమితం చేశారు. పెళ్లి కార్యక్రమం అయ్యాక.. గోల్ఫ్ బగ్గీలో గ్రౌండ్ మొత్తం తిరుగుతూ.. పెళ్లికి విచ్చేసిన అతిధుల అభినందనలు స్వీకరించారు. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ పెళ్లిని ఆన్ లైన్ లో పలు దేశాల్లో 300 మంది చూశారు. ఈ ఖరీదైన పెళ్లి కోసం పెళ్లి వేదిక కోసమే రూ.14.5లక్షలు ఖర్చుచేశారని.. పెళ్లి ఖర్చు భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఫైనల్ లెక్క మాత్రం బయటకు రాలేదు. పెళ్లి ఐడియా బాగుంది కదూ?