Begin typing your search above and press return to search.

సంచలనం: మెదడుకు కంప్యూటర్ చిప్ అనుసంధానం

By:  Tupaki Desk   |   29 Aug 2020 4:00 PM GMT
సంచలనం: మెదడుకు కంప్యూటర్ చిప్ అనుసంధానం
X
ఈ ప్రపంచంలో అన్నింటికంటే పవర్ ఫుల్ మానవ మెదడు. ఎన్నో ఆవిష్కరణలకు పెట్టింది పేరు. అలాంటి మానవుడు సృష్టించిన అంతకంటే పెద్దది ‘కంప్యూటర్ చిప్’. మనిషి మెదడును మించిన పనులను ఈ చిప్ ల ద్వారా చేస్తున్నారు.

అయితే మెదడును చిప్ ను అనుసంధానిస్తే అద్భుతాలు చేయవచ్చు. ఇప్పుడు అదే చేసే పనిలో బిజీగా ఉన్నాడు బిలియనీర్ ఎలన్ మాస్క్. ఇప్పటికే ప్రైవేట్ అంతరిక్ష యాత్రలతో సత్తా చాటిన ఎలన్ మాస్క్.. ఇప్పుడు ‘న్యూరో సైన్స్’ అనే కొత్త స్టార్టప్ ను ప్రారంభించాడు. మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ ను అమర్చే విధంగా త్వరలో టెక్నాలజీ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

కాగా తాజాగా ఓ పందికి ఉన్న అనారోగ్యాన్ని సరిచేయాలనే ఉద్దేశంతో ఓ నాణెమంత సైజు ఉన్న కంప్యూటర్ చిప్ ను ఆ పంది మెదడుకు అమర్చారు. ఈ చిప్ దాని మెదడులో 2 నెలలు ఉంటుందని.. అది సక్సెస్ అయితే మనుషుల బ్రెయిన్ పై కూడా చిప్ పెట్టడానికి అవకాశం ఉంటుందని ఎలన్ మాస్క్ తెలిపారు.

ఒక వేళ ఇదే సక్సెస్ అయితే మెదడు, కంప్యూటర్ చిప్ కలిస్తే అద్భుతాలు చేయవచ్చని ఎలన్ మస్క్ ఆశిస్తున్నారు. ఈ పరిశోధనలు ఎంత వరకు సక్సెస్ అవుతాయన్నది వేచిచూడాలి.