Begin typing your search above and press return to search.
రోహిత్ ఇక చాలు.. రిటైర్మెంట్ తీసుకో..ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ట్రోల్స్
By: Tupaki Desk | 4 Nov 2020 4:40 PM ISTహిట్ మ్యాన్ ఇది మొదటిసారి అభిమానం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ ఇక చాలు రిటైర్మెంట్ తీసుకో అంటూ.. 'థాంక్యూ రోహిత్' హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఐపీఎల్లో మ్యాచ్ ఆడే సమయంలో ఏర్పడ్డ రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. టీమిండియా నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. మూడు వన్డేలు, మూడు టీ 20లు, మూడు టెస్ట్ మ్యాచ్ లను ఆడబోతోంది. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు మూడు ఫార్మాట్లకు మూడు జట్లను సెలక్టర్లు ఎంపిక చేయగా.. అందులో ఒక్క ఫార్మాట్ లో కూడా రోహిత్ శర్మ పేరు లేదు. దీనిపై అభిమానులు, మాజీ ఆటగాళ్లు నుంచి తీవ్ర విమర్శలు చెలరేగాయి. అయితే రోహిత్ శర్మ గాయపడడం వల్లే అతడి ఎంపికలను పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ సెలెక్టర్లు వెల్లడించారు. కాగా రోహిత్ శర్మకు అయిన గాయం ఏంటీ, దాని తీవ్రత ఏంటీ.. అనే వివరాలు కూడా వెల్లడించకుండానే తెలియకుండానే ఎంపిక కార్యక్రమం చేపట్టడం ఏంటని మాజీ ఆటగాళ్లు సెలక్టర్ల పై విరుచుకుపడ్డారు.
మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో కోలుకున్న రోహిత్ శర్మ ఓపెనర్ గా మళ్లీ బరిలోకి దిగాడు. 7 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ కేవలం 4 సందీప్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో అభిమానుల నుంచి రోహిత్ శర్మ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఫిట్నెస్ గా లేడని క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని ట్విట్టర్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించావని, ఇక ఆడింది చాలని తప్పుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. కొందరు '#థాంక్యూ రోహిత్ ' పేరుతో హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. అయితే రోహిత్ శర్మ అభిమానులు మాత్రం దీనిని తిప్పి కొడుతున్నారు. హిట్ మ్యాన్ ప్రస్తుతం వన్డేల్లో ప్రపంచంలోనే అద్భుతమైన బ్యాట్స్ మెన్ అని, వరల్డ్ కప్ లో అతడు ఐదు అద్భుత సెంచరీలు చేయడంతోనే టీమిండియా చక్కని విజయాన్ని సొంతం చేసుకుందని, అది మరిచిపోవద్దని హితవు పలుకుతున్నారు.