Begin typing your search above and press return to search.

ఔను.. మోడీ స‌ర్‌.. మీరు చీతాల‌నే వ‌దులుతారు.. నెటిజ‌న్ల కామెంట్స్‌

By:  Tupaki Desk   |   19 Oct 2022 11:31 AM GMT
ఔను.. మోడీ స‌ర్‌.. మీరు చీతాల‌నే వ‌దులుతారు.. నెటిజ‌న్ల కామెంట్స్‌
X
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన తాజా కామెంట్లు బూమ‌రాంగ్ అయ్యాయి. ఆయ‌న‌పై నిప్పులు చెరుగుతూ.. నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. పావురాల స్థానంలోతాము.. చీతాల‌ను వ‌దిలి పెడుతున్నామ‌ని.. గ‌ర్వంగా చెప్పుకొన్న ఆయ‌న‌.. దీని వెనుక మీనింగ్‌ను ప‌సిగ‌ట్ట‌లేక పోవ‌డంతో.. నెటిజన్లు ఈ కామెంట్ల‌పైనే విరుచుకుప‌డుతున్నారు. ''శాంతికి ప్ర‌తిరూప‌మైన‌.. పావురాల‌ను కాద‌ని.. క్రూర‌త్వానికి ప్ర‌తిరూప‌మైన చీతాల‌ను ప్రేమిస్తున్నారు మ‌న మోడీజీ.. వీటినే ప్ర‌జ‌ల‌పై ధ‌ర‌లు.. విద్వేషాల రూపంలో వ‌దులుతున్నారు'' అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో మోడీ వ్యాఖ్య‌లు విక‌టించాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఏం జ‌రిగింది..
దేశ ఆయుధ సంపత్తి, సైనిక శక్తి సామర్థ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించే ఉద్దేశంతో.. గుజరాత్లోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన డిఫెన్స్‌ ఎక్స్‌పో-2022ను ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. దీసా ఎయిర్బేస్కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు.

"భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గత ఎనిమిదేళ్లలో ఎనిమిది రెట్లు పెరిగాయి. దేశం చాలా ముందడగు వేసింది. ఒకప్పుడు గాల్లోకి పావురాలను వదిలేవారు. ఇప్పుడు చీతాలను విడిచిపెడుతున్నాం. కేవలం భారతీయ కంపెనీలు మాత్రం పాల్గొనే తొలి డిఫెన్స్ ఎక్స్పో ఇది.

ఉత్తర గుజరాత్‌లో నిర్మించే దీసా వద్ద కొత్త ఎయిర్‌బేస్.. దేశ భద్రతకు సమర్థవంతమైన కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. త్వరలోనే 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం విధిస్తాం. వీటిని భారత్లోనే తయారుచేసి వినియోగించుకోవాలి. అంతర్జాతీయ భద్రతతో పాటు స్వేచ్ఛా వాణిజ్యం కోసం మొత్తం ప్రపంచానికి సముద్ర భద్రత ప్రాధాన్యంగా మారింది.'' అన్నారు.

అయితే.. మోడీ చేసిన వ్యాఖ్య‌ల్లో పావురాల‌ను చిన్న చూపు చూడ‌డాన్ని.. నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ''శాంతి, సామ‌ర‌స్యాల‌కు.. ప్ర‌తిరూప‌మైన పావురాలు మ‌న మోడీకి న‌చ్చ‌డం లేదు. క్రూర‌త్వం.. కాఠిన్యం నింపుకుని.. నిత్యం మాంసాహార భ‌క్ష‌ణం చేసే..చీతాలు ఎక్కువై పోయాయి'' అని కొంద‌రు కామెంట్లు చేశారు. అదేస‌మ‌యంలోమ‌రికొంద‌రు.. దేశంలో జ‌రుగుతున్న అల్ల‌ర్లు.. మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు ముడిపెట్టారు. మోడీ హ‌యాంలో చీతాల‌ను త‌ల‌పించే పాల‌నే సాగుతోంద‌ని వ్యాఖ్యానించారు.

అస‌లు పావురాల విలువ తెలుసా? వాటిని ఎందుకు వ‌దిలి పెడ‌తారో.. తెలుసా? అని మ‌రొక‌రు కామెంట్ చేశారు. అదేస‌మ‌యంలో చీతాల‌ను విడిచిపెట్టేది.. సంహారానికే.. అంటే.. మీరు సంహార‌మే కోరుకుంటున్నారా? మోడీజీ అని మ‌రొక‌రు.. ఇలా.. నెటిజ‌న్లు జోరుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మ‌రి దీనిపై బీజేపీ నేత‌లు ఎలా కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.