Begin typing your search above and press return to search.

నా భార్య అలా చేస్తే.. నా తప్పేంటి? నెటిజన్లకు ఇర్ఫాన్​ స్ట్రాంగ్​ కౌంటర్​..!

By:  Tupaki Desk   |   27 May 2021 12:30 AM GMT
నా భార్య అలా చేస్తే.. నా తప్పేంటి? నెటిజన్లకు ఇర్ఫాన్​ స్ట్రాంగ్​ కౌంటర్​..!
X
ఇర్ఫాన్​ పఠాన్​ ఇటీవల సోషల్​ మీడియాలో యాక్టివ్​ గా ఉంటున్న విషయం తెలిసిందే. రీసెంట్​ గా ఇజ్రాయేల్​.. పాలస్తీనా విషయంలో పఠాన్​ పెట్టిన ఓ పోస్ట్​ వివాదాస్పదమైంది. ఈ విషయంపై బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ఇర్ఫాన్​ ను విమర్శించింది. మన దేశంలోని పశ్చిమ బెంగాల్​ లో హిందువులు మీద దాడులు జరిగితే ఇర్ఫాన్​ పఠాన్​ కనీసం స్పందించడు. కానీ ఎక్కడ ఇజ్రయేల్​.. పాలస్తీనా గొడవ విషయంలో మాత్రం జోక్యం చేసుకుంటాడు. అంటూ కంగనా రనౌత్​ విమర్శలు గుప్పించింది.

దీనికి పఠాన్​ కూడా గట్టిగానే కౌంటర్​ ఇచ్చాడు. తనకు మానవత్వం ఉందని.. ఓ మనిషిలా స్పందించానని.. కుల మతాలను తాను పట్టించుకోలేదంటూ గట్టిగా కౌంటర్​ ఇచ్చాడు. ఈ విషయంలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి దుమ్మెత్తి పోసుకున్నాయి. ఓ వర్గం కంగనాకు మద్దతుగా పోస్టులు పెట్టగా.. మరో వర్గం పఠాన్​ కు మద్దతుగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఇర్ఫాన్​ పఠాన్​ మరోసారి నెటిజన్లకు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..

ఇర్ఫాన్​ పఠాన్​ భార్య.. తన కుమారుడి అకౌంట్​ నుంచి ఓ పిక్​ పోస్టు చేసింది. ఈ పిక్​ లో పఠాన్​ భార్య తన మొఖాన్ని బ్లర్​ చేసింది. అయితే ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇర్ఫాన్​ పఠాన్​ భార్య తన పిక్​ బ్లర్​ చేసుకోవడం పట్ల ఇష్టారాజ్యంగా కామెంట్లు పెట్టారు. ఓ వైపు ఇర్ఫాన్​ పఠాన్​ ను ట్రోల్​ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. ఈ ట్రోలింగ్​ తో విసుగెత్తిన ఇర్ఫాన్​ పఠాన్​ ఈ విషయం పై నేరుగా స్పందించారు.

'నా భార్య తన ఫొటోను బ్లర్​ చేసి పెట్టుకుంది. అది ఆమె వ్యక్తిగత విషయం. మీకు వచ్చిన సమస్య ఏమిటి? నేను ఆమెకు భర్తను మాత్రమే. ఆమెకు యజమానిని కాదు. ఆమె చేసే ప్రతి చర్యకు నేను బాధ్యుడిని కాను. అయినా ఫొటో పెట్టడం .. బ్లర్​ చేసుకోవడం వ్యక్తిగత విషయం’ అంటూ నెటిజన్లకు స్ట్రాంగ్​ గా కౌంటర్​ ఇచ్చాడు ఇర్ఫాన్​ పఠాన్​. మొత్తానికి ఈ విషయం సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.