Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లో అందరినీ అన్ ఫాలో చేశాడు..ఆ దేశ ప్రధానిపై నెటిజన్ల ట్రోల్స్

By:  Tupaki Desk   |   9 Dec 2020 6:00 PM IST
ట్విట్టర్ లో అందరినీ అన్ ఫాలో చేశాడు..ఆ దేశ ప్రధానిపై   నెటిజన్ల ట్రోల్స్
X
సెలబ్రిటీలు, స్టార్లు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. సోషల్ మీడియాలో ఉంటే సమస్య ఏంటి అని అనుకోవచ్చు. మామూలు వ్యక్తులకు సమస్య కాదు గాని వీఐపీలకు మాత్రం సోషల్ మీడియాలో బ్యాలెన్స్ లేకపోయినా విమర్శల పాలు కావాల్సి ఉంటుంది. ఒక ప్రముఖ వ్యక్తి ట్విట్టర్లోనో, ఇన్ స్టా లోనో యాక్టివ్గా ఉంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు స్పందిస్తే ఓ రకమైన పెడార్థాలు తీస్తారు. స్పందించకపోతే అసలు స్పందన లేదని విమర్శలు చేస్తారు. స్టార్ల వ్యక్తిగత అభిప్రాయాలకు అక్కడ చోటే లేదు. ప్రతి దాని పైన కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు. అందుకే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.

ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఏ సమస్య వచ్చిందో తెలియదు కానీ ట్విట్టర్లో ఉన్నట్లుండి ఆయన అందర్నీ అన్ని ఫాలో కావడం మొదలు పెట్టారు. రెండేళ్ల కిందట పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ పదేళ్ల కిందట ట్విట్టర్ ఖాతా తెరిచారు. అప్పటి నుంచి ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు. తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకునే వారు. ఆయనకు ట్విట్టర్లో 12.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాని అయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో మరింత ఎక్కువగా ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన విశేషాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేసేవారు. తన ట్విటర్ ఖాతా ద్వారా మరి కొంతమందిని ఫాలో అయ్యేవారు. ఇమ్రాన్ ఖాన్ మూడో వివాహం చేసుకున్నప్పటికీ మొదటి భార్య జెమియాను ట్విట్టర్ ద్వారా ఫాలో అవుతూ వచ్చారు.

తాజాగా ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్లో అందర్నీ అన్ ఫాలో చేశారు. ఇమ్రాన్ ఎందుకలా చేశారో ఎవరికీ అంతుబట్టడం లేదు. దీనిపై నెటిజనులు ఇమ్రాన్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఆయన పైన జోకులు వేస్తున్నారు. ఉన్నట్టుండి ట్విట్టర్లో అన్ ఫాలో అయి మొదటి భార్య జెమీయా గుండెను ముక్కలు చేశావంటూ..ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఇమ్రాన్ కూడా నవాజ్ షరీఫ్ బాటలోనే పయనిస్తున్నారు.. అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇమ్రాన్ ట్విట్టర్లో అందర్నీ అన్ ఫాలో కావడానికి గల కారణాలపై ఏమిటబ్బా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.