Begin typing your search above and press return to search.

తిరుపతి టూర్ లో బాబు చూపించిన సీన్లు మామూలుగా లేవుగా?

By:  Tupaki Desk   |   9 April 2021 12:05 PM IST
తిరుపతి టూర్ లో బాబు చూపించిన సీన్లు మామూలుగా లేవుగా?
X
టీడీపీ అధినేత చంద్రబాబు కన్ ఫ్యూజన్ లో ఉన్నారా? తానేం చేయాలన్న విషయంపై ఆయన కిందామీదా పడుతున్నారా? తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చిన సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు ఈ అనుమానానికి కారణంగా చెప్పాలి. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైన తర్వాత ఏపీలో టీడీపీ పని అయిపోయిందన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలాంటివేళలో తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన.. పార్టీ ఛరిష్మాకు ఏ మాత్రం డోకా లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

అయితే.. బాబు వ్యవహారశైలిలోనే ఏదో తేడా కనిపించింది. గతంలో మాదిరి కాన్పిడెంట్ గా లేని ఆయన.. ప్రతి విషయంలోనూ ఒకలాంటి త్రోటుపాటు కనిపించినట్లుగా చెప్పాలి. పక్కా ప్లాన్ తో టూర్ సాగుతున్నా..కొన్ని విషయంలో ఆయన కచ్ఛితమైన నిర్ణయాన్ని తీసుకోలేదా? అన్న సందేహానికి గురయ్యే పరిస్థితి.

రేణిగుంట ఎయిర్ పోర్టులో దిగిన ఆయన.. నేరుగా తిరుమలకు వెళ్లటం వరకు బాగానే ఉంది. తిరిగి వచ్చే వేళలో పార్టీ కార్యకర్తల కోరిక మేరకు వారి ఇళ్లకు వెళ్లి కాసేపు గడిపారు. చంద్రబాబు స్వయంగా రావటంతో వారి సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. అనంతరం తిరుపతి బయలుదేరినవారు.. రేణిగుంటలోని స్టార్ హోటల్ కు చేరుకున్నారు. అక్కడేకాసేపు రెస్టు తీసుకున్నారు. అక్కడఆయన్ను పలువురు కలిశారు.

స్టార్ హోటల్ ఆవరణలో బాబు కోసం ప్రత్యేకంగా ఒక వ్యానిటీ బస్సులోపలకు వెళ్లి భోజనం చేశారు. సాయంత్రం వరకు అందులోనే గడిపారు. తక్కువ మంది నేతల్ని మాత్రమే బస్సులోపలకు అనుమతించారు. ఇక్కడ చెప్పొచ్చొదేమంటే.. స్టార్ హోటల్ లో గడిపిన ఆయన.. సమావేశాలకు మాత్రం తన బస్సును వాడుకోవటం వెనుక కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన కదలికల్ని ప్రభుత్వం అనుక్షణం గమనిస్తుందన్న విషయంతో పాటు.. తన వివరాలు ఎక్కడ లీక్ అవుతాయన్న ఆందోళన ఆయనలో ఉన్నట్లుగా చెప్పాలి. ఈ కారణంతోనే స్టార్ హోటల్ ఆవరణలో తన వ్యానిటీ వ్యాన్ ఉంచి.. అందులో మీటింగ్ లు పెట్టుకోవటం గమనార్హం.

ఓవైపు స్టార్ హోటల్ లగ్జరీని మిస్ కాకుండా ఉండటం.. అదే సమయంలో వ్యానిటీ వ్యానులో ఉండటం ద్వారా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెప్పక తప్పదు. అంతేకాదు.. శ్రీకాళహస్తిలో ప్రచారం ముగిసిన తర్వాత కూడా.. ఆయన నిద్ర పోయింది బస్సులోనే కావటం గమనార్హం. కాకుంటే.. శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయ ఆవరణలో బస్సు ఉంచి.. అందులో నిద్ర పోవటం విశేషం. కాసింత సేపు రెస్టు తీసుకోవటానికి స్టార్ హోటల్ ను వాడిన చంద్రబాబు.. రాత్రి వేళ నిద్రపోయేందుకు మాత్రం తన సొంత వ్యానిటీని నమ్ముకోవటం విశేషం. ఇదంతా చూసినప్పుడు ఏదో తెలీని కన్ఫ్యూజన్ బాబును వెంటాడుతుందని చెప్పక తప్పదు.