Begin typing your search above and press return to search.
అదిరిపోయిన మోడీ `వ్యాక్సిన్` డప్పు.. నెటిజన్ల టాక్
By: Tupaki Desk | 4 Jun 2021 8:00 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మళ్లీ డప్పు కొట్టుకున్నారు. అయితే.. ఈ సారి తన సర్కారుపై నేరుగా కాకుం డా.. పరోక్షంగా ఆయన డప్పు కొట్టు కోవడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. `ఇదేంటి మోడీజీ.. వారి కష్టం మీ ఖాతాలో వేసుకుంటున్నారే!` అని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సొసైటీ(CSIR) సమావేశం వర్చువల్‌గా సాగింది. దీనిలో ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తన సర్కారును పరోక్షంగా పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ అద్భుతాలు సృష్టించిందని.. అన్నారు. భారత్ స్వతహాగా ఏడాదిలోనే కరోనా టీకాను తయారు చేసినందుకు శాస్త్రవేత్తలను ప్రశంసించారు. అదేసమయంలో ఇదంతా కూడా తమ ప్రభుత్వ గొప్పేనని చాటు కున్నారు. ఇప్పుడు భారత్ అగ్ర దేశాలతో పాటు ఆవిష్కరణలలో వేగంగా దూసుకుపోతోందని కితాబిచ్చుకున్నారు.
ఇతర దేశాల్లో నూతన ఆవిష్కరణల కోసం భారత్ ఎదురు చూసే రోజులు పోయాయని అన్నారు. అయితే.. ఈ కామెంట్లపై నెటిజన్ల నుంచి వెంటనే రియాక్షన్ వచ్చేసింది. బహుశ వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చే రియాక్షన్ కన్నా వేగంగా నెటిజన్లు స్పందించారు. నెటిజన్లు ఏమన్నారంటే..
+ మోడీజీ.. శాస్త్రవేత్తలకు గత ఏడాది కాలంలో మీరు చేసిన సాయం ఏంటి?
+ శాస్త్రవేత్తలను ఏ విధంగా ప్రోత్సహించారు..?
+ వ్యాక్సిన్ తయారైన తర్వాత... దానికి మీ ట్యాగ్ వేసుకోవడమే పాలనలో ఘన కార్యమా?
+ ఈ ఏడాది జనవరి తర్వాతనే కదా.. మీరు రియాక్ట్ అయింది? అప్పటి వరకు వ్యాక్సిన్ విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోలేదు?
+ ఇప్పుడు భారత వ్యాక్సిన్‌పై మీరు చేసుకుంటున్న ప్రచారం.. రాజకీయం కాదా?
+ ఇప్పటికీ.. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కోరుతున్న నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నారా? చెప్పండి?
+ బడ్జెట్ కేటాయింపుల్లో వ్యాక్సిన్‌కు ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఎంతో చెప్పగలరా సార్?
.. ఇలా.. మోడీని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే.. సహజంగానే ఇలాంటి వాటికి సమాధానం చెప్పని పీఎంవో.. ఇప్పుడు వీటిని కూడా తొలగించాలని.. ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి మోడీ వారు ఏం చేస్తారో చూడాలి.