Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాదిరి కాకుండా భిన్నమైన మాటలు చెప్పిన ఆ సీఎం

By:  Tupaki Desk   |   11 Jan 2022 4:31 AM GMT
కేసీఆర్ మాదిరి కాకుండా భిన్నమైన మాటలు చెప్పిన ఆ సీఎం
X
తెలుగు వారికి సంక్రాంతి ఎంత పెద్ద పండగో.. తమిళులకు అంతే ముఖ్యం. ఆ మాటకు వస్తే.. మరికాస్త ఎక్కువే. ‘పొంగల్’ పేరుతో వారు జరిపే ఈ పెద్ద పండగను భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కరోనా థర్డ్ వేవ్ కారణంగా.. గతంలో మాదిరి పొంగల్ ను ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఓవైపు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు రాకెట్ వేగంతో పెరిగిపోతున్న వేళ.. పెద్ద పండుగను భారీగా సెలబ్రేట్ చేయటం ఒక ఎత్తు అయితే.. పొంగల్ వేళ తమిళులు నిర్వహించే జల్లికట్టు విషయంపై స్టాలిన్ సర్కారు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

జల్లికట్టు విషయంలో తమిళులు ఎంత పట్టుదలగా ఉంటారన్నది.. దానిపై బ్యాన్ విధిస్తే.. సుప్రీంలో వారు చేసిన పోరాటం గురించి తెలిసిందే. చివరకు జల్లికట్టు తమ సంప్రదాయమన్న విషయాన్ని స్పష్టం చేసి.. తమ మనోభావాలకు తగ్గట్లు పోరాడి సాధించుకున్నారు. తనకు ఎదురైన థర్డ్ వేవ్ సవాలును.. తెలివైన ఆదేశాల్ని జారీ చేయటం ద్వారా ఈ గండం నుంచి సీఎం స్టాలిన్ బయటపడ్డారని చెప్పాలి. పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టుకు స్టాలిన్ సర్కార్ ఓకే చెప్పింది. అయితే.. దీనికి సంబంధించిన పక్క మార్గదర్శకాల్ని విడుదల చేశారు.
150 మంది వీక్షకులను లేదంటే.. మొత్తం సీటింగ్ సామర్థ్యం 50 శాతం మందినే అనుమతించాలని పేర్కొన్నారు.

అంతేకాదు.. జల్లికట్టు పోటీలకు సంబంధించి పక్కా మార్గదర్శకాల్ని విడుదల చేశారు. జల్లికట్టులో పాల్గొనేందుకు ముందుకు వచ్చే ఎద్దుల యజమానులు.. తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలంటే కండీషన్లు పెట్టారు. ఎద్దుల యజమానులు.. వారి సహాయకులుగా హాజరయ్యే వారంతా తాము రెండో డోసుల టీకాల్ని వేయించుకున్నట్లుగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను సమర్పించాలి.

అంతేకాదు పోటీల్లో పాల్గొనేందుకు.. కనీసం 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టును తమ వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ ప్రొసీజర్ ను పక్కాగా పాటించిన వారికి మాత్రమే ఐడెంటిటీ కార్డు ఇవ్వనున్నారు. జిల్లా యంత్రాంగం ఇచ్చే ఐడెండిటీ కార్డులు ఉన్న వారిని మాత్రమే క్రీడా ప్రాంగణంలోకి అనుమతి ఇస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. జల్లికట్టు సందర్శంగా జంతువులకు ఎలాంటి హాని జరగకూడదని స్పష్టం చేశారు.

ఇదంతా చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు అప్రయత్నంగా గుర్తుకు వస్తాయిన పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. ఎవరింట్లో వాళ్లు ఉండి సంక్రాంతి పండుగను చేసుకోవాలని పేర్కొనటం తెలిసిందే. ఇదంతా చూసినప్పుడు.. ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే.. తన నిర్ణయంపై ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేలా ప్లాన్ చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఐడియాను అభినందించకుండా ఉండలేం.