Begin typing your search above and press return to search.

రిషబ్ పంత్‌ని కలవరపెట్టొద్దని ఊర్వశి రౌతేలాకు నెటిజన్ల సెటైర్లు

By:  Tupaki Desk   |   8 Oct 2021 10:08 AM IST
రిషబ్ పంత్‌ని కలవరపెట్టొద్దని ఊర్వశి రౌతేలాకు నెటిజన్ల సెటైర్లు
X
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ దృష్టి మరల్చడాన్ని ఆపివేయాలని కోరుతూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తన ఫిట్‌నెస్ బాడీ , జిమ్ వర్కౌట్‌ల కోసం తరచుగా వార్తల్లో ఉండే నటి తాజాగా రిషబ్ పంత్ తో క్లోజ్ గా ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మంచి క్రికెట్ భవిష్యత్ ఉన్న రిషబ్ పంత్ ను వదిలేయాంటూ తాజాగా నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఒక విచిత్రమైన కారణంతో ఆమెను ఆడిపోసుకుంటున్నారు.

ఊర్వశి ట్విట్టర్‌లో క్రికెటర్ రిషబ్ పంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ పంత్ పుట్టినరోజు అక్టోబర్ 4న. ఊర్వశి తాజాగా పంత్ కు అక్టోబర్ 5న ఒక రోజు ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పింది. అయితే రిషబ్ పంత్ కు చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసింది. నిజంగా వీరిమధ్య ఏదో జరిగిందన్న గుసగుసలకు ఇది తావిస్తోంది. అయితే నెటిజన్లు దీన్నిచూసి జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే వారు గతంలో రిషబ్ పంత్‌తో ఊర్వశికి పుకార్ల సంబంధంతో బాధపడ్డారు.

గతంలో క్రికెటర్‌ రిషబ్ పంత్ తో విడిపోయినందుకు ఊర్వశిని సోషల్ మీడియా నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఊర్వశి రౌతేలా -పంత్ 2018 లో డేటింగ్ చేసినట్లు తెలిసింది. తరువాత, ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడిపోయిన పర్యవసానంగా పంత్ ట్విట్టర్‌లో నటిని బ్లాక్ చేశారు. అతని అభిమానులకు ఇది సరిగ్గా మొదట్లో అర్థం కాలేదు. ఇప్పుడు ఊర్వశిని తనకు దూరంగా ఉండమని నెటిజన్లు కోరుతున్నారు.

"దయచేసి ప్రపంచకప్ కి ముందు మా అబ్బాయి పంత్ ని దృష్టి మరల్చవద్దు" అని ట్విట్టర్ వినియోగదారుడు ఊర్వశిని ట్యాగ్ చేసి కోరారు. "అతను టీ20 ప్రపంచకప్ లో భారత కీలక ఆటగాడు. అతన్ని డిస్టర్బ్ చేయవద్దు" అని మరొక యూజర్ ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఊర్వశి మీమ్స్ కోసం నెటిజన్లకు దొరికిపోయింది. నెటిజన్లు ఆమె పేరు మీద చమత్కారమైన సెటైర్లు వేస్తూ బోలెడు ట్రోల్స్ చేస్తున్నారు.

ఊర్వశి రౌతేల ప్రస్తుతం రణదీప్ హుడా సరసన జియో స్టూడియోస్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె ద్విభాషా థ్రిల్లర్ బ్లాక్ రోజ్ వంటి ఇతర ప్రాజెక్టులలో కూడా పనిచేస్తోంది. శరవణ సరసన 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం 'ది లెజెండ్' తో ఆమె తమిళ అరంగేట్రం చేస్తోంది. నటి జియో స్టూడియోస్ -టి-సిరీస్‌తో మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకుంది.