Begin typing your search above and press return to search.

మోదీపై పేలుతున్న రాహుల్ పంచ్‌ లు !

By:  Tupaki Desk   |   29 March 2018 12:58 PM GMT
మోదీపై పేలుతున్న రాహుల్ పంచ్‌ లు !
X
మీరు గ‌మ‌నిస్తున్నారో లేదో... మోదీ కాలం గ‌డుస్తున్న కొద్దీ రాహుల్‌ ని సీరియ‌స్‌ గా తీసుకుంటున్నాడు. మొద‌ట్లో మ‌న యువ‌రాజు అని త‌ర‌చూ జోకులేసిన మోడీ ఈ మ‌ధ్య రాహుల్ విమ‌ర్శ‌లను కొన్నింటిని విన్నా రిప్ల‌యి ఇవ్వ‌డం లేదు. మ‌రి కొన్నింటికి సీరియ‌స్‌గా కౌంట‌ర్లు వేస్తున్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారం నుంచి రాహుల్ మాట‌ల్లో కూడా వాడి వేడి బాగా పెరిగింది. అప్ప‌ట్లో జీఎస్టీపై రాహుల్ వేసిన పంచ్ బాగా పాపుల‌ర్‌. జీఎస్టీ అంటే గ‌బ్బ‌ర్ సింగ్ ట్యాక్స్ అని రాహుల్ చేసిన వ్యాఖ్య ఒక సంచ‌ల‌నం. దానికి అప్ప‌ట్లో స‌రైన రిటార్ట్ ఇవ్వ‌లేక‌పోయిన మోదీ - దానిని పెట్టింది కాంగ్రెస్సే అని వ్యాఖ్యానించ‌డం ద్వారా జీఎస్టీ జ‌నాల‌కు న‌చ్చ‌లేద‌న్న విష‌యం మోదీకి అర్థ‌మైన‌ట్లు అంద‌రికీ తెలిసొచ్చింది.

ఇక త‌ర్వాత మోడీ పేరు మీద స్కాంలేవీ బ‌య‌ట‌ప‌డ‌క‌పోయినా బ్యాంకు లూటీలు మోడీపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపాయి. డీమానిటైజేష‌న్ నుంచి మొద‌లుకొని మోడీ హ‌యాంలో దారులు తెలిస్తే ఏ ప‌ని అయినా చేసుకోవ‌చ్చ‌ని క‌ట్ట‌లుక‌ట్ట‌లుగా బ‌య‌ట‌ప‌డిన కొత్త బ్లాక్ మ‌నీ నిరూపించింది. ఇక ఇపుడు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల షెడ్యూలు కూడా వ‌చ్చేసింది. బీజేపీ-కాంగ్రెస్ అధ్య‌క్షులు కాళ్ల‌కు చ‌క్రాలు క‌ట్టుకుని క‌ర్ణాట‌క‌లో తెగ తిరుగుతున్నారు. రాహుల్ త‌న మాట‌ల‌తో మీడియాను బాగానే ఆక‌ర్షిస్తున్నారు. రాహుల్ మాట‌ల‌ను చూసిన కొంద‌రు - బీజేపీ బ్యాడ్ టైం క‌ర్ణాట‌క నుంచే మొద‌ల‌వుతుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు ఇంట‌ర్నెట్ వైర‌ల్‌. ఇంత‌కీ ఏమ‌న్నారంటే... మ‌న‌కు ఒక వీక్ చౌకీదార్ (బ‌ల‌హీన కాప‌లాదారు) ఉన్నారు. ఆయ‌న హ‌యాం లీకుల‌కు పెట్టింది పేరు. మ‌రీ ఇన్నిలీకులా.... మొద‌ట డేటాలీక్‌.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఆధార్ లీక్‌ - ఎస్సెస్సీ ఎగ్జామ్ లీక్‌ - ఎల‌క్ష‌న్ డేట్ లీక్‌... ఇపుడు తాజాగా సీబీఎస్సీ లీక్ అంటూ ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్‌ కు రిప్ల‌యిగా నెటిజ‌న్లు మోడీపై మ‌రిన్ని రిటార్టులు వేశారు. మిడిల్ క్లాస్ జేబు లీక్ అని ఒక‌రు కామెంట్ చేయ‌గా - మ‌రో అభిమాని బాహుబ‌లిలో ప్ర‌భాస్ క‌మ‌లం పువ్వులు అందుకునే సీన్లో క‌మ‌లం ప్లేసులో కాంగ్రెస్ జెండాను పెట్టారు. ఫోన్ కాల్ రికార్డులు లీక్‌ మ‌రిచిపోయారంటూ ఒక‌త‌ను రిప్ల‌యి ఇచ్చాడు.