Begin typing your search above and press return to search.
మోడీ బ్యాచ్ ను ఉతికి ఆరేస్తున్నారుగా
By: Tupaki Desk | 22 Dec 2017 7:48 AM GMTసామాన్యుడంటే రాజకీయ పక్షాలకు మహా చులకన. తాము చెప్పేది వినేసి.. గొర్రెల్లా తలూపేస్తారన్న స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్కువే. అందుకే.. అదే పనిగా బరి తెగించేస్తుంటారు. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేసేయొచ్చన్న భావన మామూలే. ఇందుకు మోడీ సైతం మినహాయింపు కాదన్నది ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది.
తనకు నచ్చింది..తనకు తోచింది చేసేస్తున్న మోడీ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై తోపుల్లాంటి రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నా.. అవి పేలాల్సిన రీతిలో పేలకుండా తుస్సు మంటుంటే.. సామాన్యులు సోషల్ మీడియాలో పేలుస్తున్న వ్యంగ్య పటాసులు అద్భుతంగా పేలటమే కాదే.. వైరల్ అవుతూ.. సరికొత్త ఐడియాలకు తెర తీస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కేసు తీర్పుపై సోషల్ మీడియాలో పడుతున్న పంచ్ లు అంతా ఇంతా కాదు. కోర్టు తీర్పు నేపథ్యంలో మోడీ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి పంచ్ ఒకటి చూస్తే..
విదేశాలకు తరలివెళ్లిన బ్లాక్ మనీని వెనక్కి తీసుకురాలేదు
2జీ స్కాం నిందితులకు శిక్ష పడలేదు
గంగ ఇప్పటికి పరిశుభ్రం కాలేదు
వాద్రా మీద ఆరోపణలు నిరూపితం కాలేదు
మాల్యా విదేశాలకు వెళ్లిపోయాడు.. ఇదంతా చూస్తుంటే.. ప్రజలు మోడీకి ఓటు ఎందుకు వేశారంటే.. తమ సిమ్ కార్డుకు ఆధార్ ను లింక్ చేయటానికి మాత్రమేనేమో?
ఇలాంటి వ్యంగ్యస్త్రాలు ఆన్ లైన్లో భారీగా పేలుతున్నాయి. మరొకటి చూస్తే..2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రచారం మొత్తం 2జీ స్కాం.. బొగ్గు కుంభకోణం మీదనే సాగింది.
2జీ స్కాం: క‌్లీన్ చిట్
బొగ్గు స్కాం: కొందరు నిందితులకు మూడేళ్లు జైలు
ఇది.. అవినీతిపై బీజేపీ బలంగా యుద్ధం చేయటమంటే..
ఇదే తీరులో సాగుతున్న వ్యంగ్యస్త్రాలు అన్ని ఇన్ని కావు. ఆన్ లైన్లో మోడీ అండ్ కోకు దిమ్మ తిరిగిపోయేలా భారీ ఎత్తున విమర్శల పంచ్ పడుతోంది.
= జెస్సికా లాల్‌ను ఎవరూ చంపలేదు.. కృష్ణ జింకలనూ ఎవరూ చంపలేదు. ఆరుషిని కూడా ఎవరూ హత్య చేయలేదు. ఇప్పుడు రూ.1.76లక్షల కోట్లను ఎవరూ దొంగలించలేదు. శభాష్ ఇండియా!!
= స్కాములను బయటపెట్టటం వినోద్ రాయ్ (కాగ్) పని కాదు. మోడీని అధికారంలోకి తేవటమే ఆయన డ్యూటీ. చాలా స్మూత్ గా పని పూర్తి చేశారు. అభినందనలు.
= మిమ్మల్ని ఎందుకు విడుదల చేయాలో ఒక్క కారణం చెబుతారా?
సర్.. ప్రపంచమంతా 4జీ అంటోంది. మీరింకా 2జీ చుట్టూ తిరుగుతున్నారు.
గుడ్.. బావుంది. విడుదల చేసేశాను పొండి
= 1760000000 అన్నది 2జీ లో గల్లంతైన సొమ్మనుకున్నాను. కానీ.. ఇవాళే తెలిసింది అది ఎ రాజా మొబైల్ నెంబరని.
= 2జీ తీర్పు విన్నాక విజయ్ మాల్యా ఇండియాకు తిరిగి రావటానికి నిర్ణయించుకున్నారు
= డీఎంకే అంటే.. ద్రవిడ మోదీ కళగం