Begin typing your search above and press return to search.

సేమ్ టు సేమ్‌.. మోడీ మార‌లేదు.. నెటిజ‌న్ల కామెంట్స్‌

By:  Tupaki Desk   |   20 Jun 2022 5:00 AM IST
సేమ్ టు సేమ్‌.. మోడీ మార‌లేదు.. నెటిజ‌న్ల కామెంట్స్‌
X
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ్య‌వ‌హార శైలిపై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. `ఇప్ప‌టికైనా మారండి మోడీ జీ` అని సూచ‌న‌లు చేస్తున్నారు. దేశం గ‌డిచిన రెండేళ్ల‌లో రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం.. వాటి వ‌ల్ల దేశంలో అగ్గి రాజేసింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఒక‌టి రైతుల‌కు సంబంధించిన మూడు వ్య‌వ‌సాయ సాగు చ‌ట్టాలు. ఇప్పుడు అగ్నిప‌థ్ నియామ‌కాలు. ఈ రెండు నిర్ణ‌యాలు కూడా దేశంలో తీవ్ర వివాదానికి దారితీశాయి.

రైతులు ఆయా చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ.. రెండు సంవ‌త్సరాల పాటు.. ఉద్య‌మాలు చేశారు. లాఠీ దెబ్బ‌లు తిన్నారు. అనేక మంది రైతులు..ఉద్య‌మంలోనే క‌న్నుమూశారు. ఇక‌, ఇప్పుడు కూడా దేశ‌వ్యాప్తంగా అగ్ని ప‌థ్ ఉద్య‌మం సాగుతోంది. ఈ ఆందోళ‌న‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన దాదాపు వంద‌ల కోట్ల రూపాయ ల ఆస్తుల‌ను సైనిక అభ్య‌ర్థులు.. ధ్వంసం చేశారు. ఈ క్ర‌మంలో సుమారు ఐదుగురు వ‌ర‌కు మృతి చెందారు. ఇంకా ఈ సెగ‌లు సాగుతూనే ఉన్నాయి.

అయితే.. ఈ రెండు ఘ‌ట‌న‌ల్లోనూ ప్ర‌ధాని మోడీ వ్య‌వ‌హ‌రించిన తీరు.. ఒకేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. అప్ప ట్లో ఏక‌ప‌క్షంగా తీసుకువ‌చ్చిన రైతు చ‌ట్టాల‌పై ఎలాంటి చ‌ర్చ లేకుండానే.. పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టా రు. దీనిపై విప‌క్షాలు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేసినా.. ఆయ‌న ప‌ట్టించుకోకుండానే.. అనుకూల పార్టీల అండ తో ఆమోదం పొందారు. ఇక‌, ఉద్య‌మాలు మొద‌లు కాగానే.. మోడీ ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశారు. తిరిగి వ‌చ్చాక కూడా ఆయ‌న స్పందించ‌లేదు.

పైగా.. త‌న మంత్రుల‌ను పుర‌మాయించి.. ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయించారు. అదేస‌మ‌యంలో రైతు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునేది లేద‌ని ద‌బాయించారు. ఇలా చాలా కాలం సాగ‌దీశారు. ఈలోగా యూపీ ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి.. త‌నంత‌ట త‌నే అర్ధరాత్రి.. వేళ‌.. ఈ సాగు చ‌ట్టాల‌ను వెనక్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అగ్నిప‌థ్ ఆందోళ‌న‌లు ప్రారంభం కాగానే.. మోడీ.. త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిపోయారు.

అదేస‌మ‌యంలో వివిధ కార్య‌క్ర‌మాలు పెట్టుకుని బిజీ అయిపోయి.. అస‌లు దేశంలో అగ్నిప‌థ్ ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం త‌న‌కు తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు.. మంత్రులు మాత్రం అగ్నిప‌థ్‌ను వెన‌క్కి తీసుకునేది లేదని.. ఇది అద్భుత‌మ‌ని.. యువ‌త‌కు భ‌విత అత్య‌ద్భుత‌మ‌ని ప్ర‌క‌ట‌న‌లు జారీ చేస్తున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు.. ``సేమ్ టు సేమ్‌.. మోడీ అస్స‌లు మార‌లేదు.`` అనే వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.