Begin typing your search above and press return to search.

కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. నెటిజన్ల మీమ్స్ వైరల్

By:  Tupaki Desk   |   25 Jun 2021 9:00 AM IST
కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. నెటిజన్ల మీమ్స్ వైరల్
X
డబ్ల్యూటీసీ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం ప్రకంపనలు సృష్టించింది. భారత అభిమానులు దీన్ని జీర్ణించుకోవడం లేదు. ఈ ఓటమిపై భారత అభిమానులు కెప్టెన్ కోహ్లీపై కోపంతో రగిలిపోతున్నారు. కోహ్లీకి, హెడ్ కోచ్ రవిశాస్త్రికి వ్యతిరేకంగా నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చేస్తూ హోరెత్తించారు.

సోషల్ మీడియాలో కెప్టెన్ కోహ్లీని మార్చాలని ట్రోలింగ్ మొదలుపెట్టారు. హ్యాష్ ట్యాగ్ లు జోడించి ట్వీట్లు హోరెత్తిస్తున్నారు. ‘మేక్ రోహిత్ ఇండియన్ కెప్టెన్’, ‘వీ వాంట్ న్యూ కెప్టెన్’ అనే రెండు హ్యాష్ ట్యాగ్ లను ట్రెండింగ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఓ వైపు మాజీ క్రికెటర్లు కూడా కెప్టెన్సీ మార్పు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు సారథ్యం అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తుదిజట్టును కూడా ఎంపిక చేసుకోలేని కోహ్లీ, గ్రౌండ్ లోనూ సరైన ఫలితాలు రాబట్టడంలో విఫలమయ్యాడని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

టీమిండియా హెడ్ కోచ్ కు ఇందులో తప్పు ఉందని.. ఆయన్ను కూడా తొలగించాలని అభిమానులు కోరుతున్నారు. ఆయన స్థానంలో రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా ఎంచుకోవాలని సూచిస్తున్నారు.