Begin typing your search above and press return to search.

మా రాష్ట్రం వారు బుద్ధిమంతులు.. ముంబైలో క‌రోనా వ్యాప్తికి వారే కార‌ణం!

By:  Tupaki Desk   |   7 April 2021 7:30 AM GMT
మా రాష్ట్రం వారు బుద్ధిమంతులు.. ముంబైలో క‌రోనా వ్యాప్తికి వారే కార‌ణం!
X
స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ఒక‌టి.. ధైర్యంగా ఎదుర్కోవ‌డం. రెండోది.. ప‌క్క‌నోళ్ల మీద‌కు నెట్టేసి త‌ప్పించుకోవ‌డం. రాజ‌కీయ నాయ‌కులు ఇందులో దేన్ని ఎంచుకుంటారో జ‌నానికి తెలిసిందే. క‌రోనా విజృంభిస్తున్న వేళ మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక‌రే చేసిన రెండో త‌ర‌హా వ్యాఖ్య‌లు వివాదాస్పదంగా మారాయి.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ గ‌త అక్టోబ‌ర్ నుంచి త‌గ్గుముఖం ప‌ట్టింది. నవంబ‌ర్‌, డిసెంబ‌ర్ నాటికి ఇక బ‌య‌ట‌ప‌డ్డాం అనే భావ‌న‌లోకి వ‌చ్చేశాయి అన్ని రాష్ట్రాలూ. కానీ.. మ‌హారాష్ట్ర మాత్రం రాలేక‌పోయింది. క‌రోనా మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచీ.. అక్క‌డ ఇబ్బ‌డి ముబ్బ‌డిగా కేసులు పెరుతూనే వ‌చ్చాయి. అన్ని రాష్ట్రాలూ తొలిద‌శ‌ క‌ట్ట‌డి విష‌యంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయిన‌ప్ప‌టికీ.. మ‌హారాష్ట్ర ఎందుకు విజ‌య‌వంతం కాలేక‌పోయింది? అక్క‌డి ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంద‌నేది ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం.

ఇప్పుడు దేశం మొత్తం సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మొద‌ట్నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ కేసులు త‌గ్గ‌ని ముంబైలో.. తార‌స్థాయికి చేర‌డంతో పాక్షిక‌ లాక్ డౌన్ కూడా విధించాల్సి వ‌చ్చింది. దీనిపై రాజ‌శ్ థాక‌రే స్పందిస్తూ.. ముంబైకి వ‌ల‌స వ‌చ్చిన వారివ‌ల్లే క‌రోనా వ్యాపిస్తోంద‌ని చెప్ప‌డం వివాదాస్ప‌ద‌మైంది. అంటే.. త‌మ రాష్ట్రం వారు బుద్ధిమంతులేగానీ.. బ‌య‌ట నుంచి వ‌చ్చిన‌వారే ప‌ద్ధ‌తీపాడూ లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, దానివ‌ల్లే కేసులు పెరుగుతున్నాయ‌ని ప‌రోక్షంగా ప్ర‌క‌టించారు.

దీనిపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌ల‌స కార్మికుల‌పై నింద‌లు వేయ‌డం ద్వారా.. ప్ర‌భుత్వం త‌ప్పించుకోవాల‌ని చూస్తోంద‌ని మండిప‌డుతున్నారు జ‌నం. ఇలాంటి వ్యాఖ్య‌లు జ‌నాల్లో విద్వేషం పెంచ‌డానికి ప‌నికొస్తాయే త‌ప్ప‌, స‌మ‌స్య ప‌రిష్కారానికి కాద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ఇలాంటి ఆరోప‌ణ‌లు చేసేబ‌దులు.. క‌రోనా క‌ట్ట‌డికి ఏం చేయాలో సూచిస్తే, వాటిని పాటిస్తే బాగుంటుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.