Begin typing your search above and press return to search.

మోడీని వెనకేసుకొచ్చి తిట్టిపోస్తున్న కంగనా

By:  Tupaki Desk   |   28 April 2021 7:30 AM GMT
మోడీని వెనకేసుకొచ్చి తిట్టిపోస్తున్న కంగనా
X
నిజానికి ‘రిజైన్ మోడీ’ అంటే ప్రధాని కూడా ఇంతలా స్పందించలేదు. కానీ మన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రౌనత్ మాత్రం మోడీపై ఈగ వాలనీయకుండా కాపుకాస్తోంది.. మోడీని అంటారా? అని నెటిజన్లపై మండిపడుతోందట.

ప్రధాని నరేంద్రమోడీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడని ఆరోపిస్తూ నెటిజన్లు రెండు రోజులుగా ‘రిజైన్ మోడీ’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండింగ్ లో ‘రిజైన్ మోడీ’ రెండో స్థానంలో ఉంది.

అయితే ప్రధాని మోడీపై హ్యాష్ ట్యాగ్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ విరుచుకుపడింది. కోవిడ్ కేసులు పెరగడానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలంటూ పలువురు నెటిజన్లు మంగళవారం ట్విట్టర్ లో ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. దానికి కంగనా రౌనత్ ఘాటైన సమాధానం ఇచ్చారు.

కంగనా రౌనత్ ట్వీట్ చేస్తూ ‘అవును.. మోడీ గారికి నాయకత్వం తెలియదు.. సచిన్ కు బ్యాటింగ్ రాదు.. కంగనా రనౌత్ కు నటన తెలియదు’ అంటూ ఫైర్ అయ్యింది.

ఇంత కరోనా కల్లోలం ఆక్సిజన్ లేక.. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక జనాలు చనిపోతుంటే.. కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపకపోగా ఆయనను వెనకేసుకొస్తున్న కంగనా తీరును నెటిజన్లు కడిగేస్తున్నారు. నీ ప్రేమ సల్లగుండా జనాలు ప్రాణాలు పోతున్నా స్పందించవా? అంటూ నిలదీస్తున్నారు.