Begin typing your search above and press return to search.
ఇప్పటికీ ఎగ్జామ్స్.. ఈ మొండితనం ఏంది ఆదిమూలపు సురేశ్?
By: Tupaki Desk | 29 May 2021 10:00 AM ISTఏదైనా విషయంలో పట్టుదల ఉండటం మంచిదే. కానీ.. అది కాస్తా మొండితనంగా మారితేనే ఇబ్బంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో పది.. ఇంటర్ పరీక్షల్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామంటూ ఏపీ ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తున్న వైనం షాకింగ్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండి.. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎప్పుడో మార్చిలో నిర్వహించాల్సిన పరీక్షల్ని.. కరోనా కలకలంలోనూ విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం పరీక్షల్ని నిర్వహించాల్సిందేనన్న పట్టుదలతో ఉంది ఏపీ ప్రభుత్వం.
దీనిపై విద్యార్థులు.. వారి తల్లిదండ్రులతో పాటు.. విద్యా రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థులు.. వారి తల్లిదండ్రులతో పాటు.. వేలాది మంది ఉపాధ్యాయులు.. సిబ్బందితో కలిసి పరీక్షల్ని నిర్వహిస్తే.. కరోనా వైరస్ మరోసారి విరుచుకుపడే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే విపక్షాలు సైతం.. పది.. ఇంటర్ పరీక్షల్ని రద్దు చేయాలని.. మిగిలిన రాష్ట్రాల మాదిరి విద్యార్థుల్ని ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ.. ఏపీ సర్కారు మాత్రం అందుకు ససేమిరా అంటోంది.
మరో రెండు రోజుల్లో జూన్ లోకి ప్రవేశిస్తున్న పరిస్థితి. ఇప్పటికి ఏపీలో కేసుల నమోదు తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి జులై మధ్య వరకు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటివేళ.. పరీక్షల్ని నిర్వహించటం సాధ్యం కాదన్నమాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీలోనూ పరీక్షల్ని రద్దు చేస్తారన్న ప్రచారం ఈ మధ్యన జోరందుకుంది. ఇలాంటివేళ స్పందించిన ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షల్ని నిర్వహించటం ఖాయమన్నారు.
ఇప్పటికే రెండుసార్లు పరీక్షల్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. త్వరలోనే పది.. ఇంటర్ విద్యార్థులకు పరీక్షల్ని నిర్వహిస్తామన్నారు. పరీక్షలు రద్దు అయ్యాయని ప్రచారం చేస్తున్న కొన్ని ఇంటర్ కాలేజీలు రాష్ట్రంలో ఆడ్మిషన్లు నిర్వహిస్తున్న వైనం తమ వరకు వచ్చిందన్నారు. అలాంటి కాలేజీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అతి త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇదంతా చూస్తుంటే.. పరీక్షలు వద్దన్న వారి మాటకు భిన్నంగా.. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఖాయమన్ సంకేతాల్ని.. మొండితనానికి పరాకాష్ఠంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి.. సమయానుకూల నిర్ణయాన్ని తీసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.