Begin typing your search above and press return to search.

రఘురామా... కొంప ముంచకుమా... ?

By:  Tupaki Desk   |   27 Aug 2021 3:34 AM GMT
రఘురామా... కొంప ముంచకుమా... ?
X
వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు రంగు రుచి వాసన ఏంటి అన్నది ఏపీ జనాలకు తెలిసిపోయింది. ఆయన వాట్సప్ సందేశాలు, పెదబాబు, చినబాబులతో పంచుకున్న తీరుని ఏపీ సీఐడీ బయటపెట్టిన తరువాత ఆయన మీద టీడీపీ ముద్ర కచ్చితంగా పడిపోయింది. ఆ ముద్రతో ఆయన ఎన్ని విమర్శలు చేసినా టీడీపీకి లాభం లేకపోగా మరింత చేటు కలిగే అవకాశం ఉంది. రఘురామ కృష్ణం రాజు మా ముఖ్యమంత్రి అని ఒక వైపు అంటూనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టుకు వెళ్ళడాన్ని జనాలు సరిగ్గానే అర్ధం చేసుకుంటారు. అంతే కాదు ఆయన ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ మా ప్రభుత్వం అంటే ఎవరు నమ్ముతారు. అంతే కాదు ఏపీలో వైసీపీ ఓడిపోతుంది, టీడీపీ గెలుస్తుంది అని చెబుతున్న ఆయన వైసీపీ ఎంపీ ఎలా ? అవుతాడు అని రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరైనా ఇంట్టే గ్రహిస్తారుగా..!

ఇవన్నీ పక్కన పెడితే జగన్ బెయిల్ రద్దు అవుతుంది, ఆయన జైలుకు పోతాడు అంటూ అటు రఘురామతో పాటు ఇటు టీడీపీ అనుకూల మీడియా కూడా గట్టిగానే ప్రచారం చేస్తోంది. దీని వల్ల జనాలకు అర్ధమయ్యేది ఏంటి అంటే జగన్ మీద మరో మారు గట్టిగానే కుట్ర జరుగుతోంది అనే..! ఆయన ఇపుడు ఏమి నేరం చేశాడని జైలుకు పంపుతారు అని సగటు జనం ప్రశ్నించుకోరా. అంతే కాదు ఆయన ఏపీలో అధికారంలో ఉన్నాడని, టీడీపీని ఓడించాడనే కక్ష కట్టి ఇంతటి పనికి ఒడిగట్టారని భావించరా ? అన్న ప్రశ్న‌లు ఉత్ప‌న్నం కావ‌డంతో పాటు పై పెచ్చు అంతిమంగా ఇది జ‌గ‌న్‌కే సానుభూతిగా మారుతోంది. ఇపుడు అదే టీడీపీ మెడకు ఉచ్చులా మారే అవకాశం ఉంది అంటున్నారు.

జగన్ విషయం తీసుకుంటే ఆయన తన పని తాను చేసుకుని పోతున్నారు. ఆయన మీద అప్పట్లో సీబీఐ పెట్టిన కేసులే అక్రమంగా ఉన్నాయని, కాంగ్రెస్, టీడీపీ కలసి పెట్టించారు అన్నది కూడా జనాలకు తెలుసు. ఇపుడు మళ్ళీ జగన్ జైలూ అంటే అది కచ్చితంగా బూమరాంగ్ అవుతుంది అంటున్నారు. చంద్రబాబు ఎంతసేపూ షార్ట్ కట్ మెదడ్స్ ని నమ్ముకుంటున్నారు తప్ప జనాభిమానాన్ని పొందలేకపోతున్నారు అంటున్నారు. మరో వైపు చూస్తే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏపీలో జగన్‌ను ఏదో చేద్దామని చూస్తే కనుక అది కచ్చితంగా మరోమారు టీడీపీకే చెక్ పెడుతుందని, వైసీపీకే వరంగా మారుతుంది అంటున్నారు. మరి ఈ మాత్రం లాజిక్ తెల్సుకోకుండా రఘురామను ప్రోత్సహిస్తే నష్టపోయేది ముమ్మాటికీ టీడీపీయే అనే వారూ సొంత పార్టీలో ఉన్నారు.