Begin typing your search above and press return to search.

బుర్ఖా వేసుకొని బయటకు వస్తే భారీ ఫైన్

By:  Tupaki Desk   |   3 Aug 2019 8:00 PM IST
బుర్ఖా వేసుకొని బయటకు వస్తే భారీ ఫైన్
X
మత విశ్వాసాల గురించి రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. అయితే.. కొన్ని దేశాల్లో మత విశ్వాసాలకు పెద్ద పీట వేయటం కనిపిస్తుంది. అదే సమయంలో మరికొన్ని దేశాల్లో తొలుత దేశ భద్రత.. దేశం తర్వాతే మతం కానీ.. మత విశ్వాసాలు కానీ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇదే తీరును ప్రదర్శించింది నెదర్లాండ్ సర్కారు. తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ఇకపై.. తమ దేశంలోని ముస్లిం మహిళలు ఎవరూ బయటకు బుర్ఖాతో రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా బుర్ఖాతో బహిరంగ ప్రదేశాలకు వస్తే.. వారికి భారీ జరిమానా తప్పదని డచ్ సర్కారు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది.ప్రభుత్వ కార్యాలయాలు.. ప్రైవేటు రవాణా.. ఆసుపత్రులు.. విద్యాలయాలకు బుర్ఖాలో రావటంపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి బుర్ఖాపై బ్యాన్ ను పలు యూరోపియన్ దేశాలు విధించాయి. జర్మీనీ.. ఫ్రాన్స్.. బెల్జియం తదితర దేశాల్లోని మహిళలు ఎవరూ బుర్ఖా వేసుకొని బయటకు రాకూడదు. ఒకవేళ అలా వచ్చిన పక్షంలో చర్యలు తీసుకుంటారు. తాజాగా నెదర్లాండులో బుర్ఖా వేసుకొని బయటకు వచ్చే మహిళలకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడా దేశంలో సంచలంనగా మారింది.