Begin typing your search above and press return to search.

నేతాజీ మనమడు రిలీజ్ చేసిన సీక్రెట్ లెటర్స్

By:  Tupaki Desk   |   9 Dec 2015 4:21 AM GMT
నేతాజీ మనమడు రిలీజ్ చేసిన సీక్రెట్ లెటర్స్
X
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబందించిన మరికొన్ని రహస్య పత్రాలు విడుదలయ్యాయి. అయితే.. వీటిని నేతాజీ మనమడు అశిష్ రాయ్ విడుదల చేశారు. ఈ పత్రాలు.. భారత్ .. రష్యాల మధ్య రహస్యంగా జరిగాయి. ఈ రహస్య లేఖల్లోని సమాచారం చూసినప్పుడు.. 1945లో నేతాజీ మరణించటంపై భారత సర్కారుకు కొంత సందేహం ఉన్నట్లుగా తెలియటంతో పాటు.. ఆయన రష్యాలో ఉన్నారా? అన్న సందేహాం వ్యక్తమయ్యేలా ఉండటం గమనార్హం.

అయితే.. ఈ లేఖలు 1991 – 1995 మధ్య కాలంలో జరిగాయి. ఆ సమయంలో భారత్ సర్కారు రష్యాను ఒక ప్రశ్నను రెండు సార్లు మార్చి.. మార్చి ప్రశ్నించింది. ‘‘1945లో నేతాజీ రష్యాలో ఉన్నారా?’’ అంటూ రహస్యంగా అడిగింది. అయితే.. ఈ లేఖలకు బదులిచ్చిన రష్యా.. తమ వద్ద అలాంటి సమాచారం ఏమీ లేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా మరోసారి ఇలాంటి ప్రశ్ననే రష్యాను భారత్ అడిగినప్పటికీ.. నేతాజీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి రహస్య సమాచారం లేదంటూ బదులిచ్చింది. డిసెంబరు చివరిలో ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో నేతాజీకి సంబంధించిన రహస్య లేఖలు విడుదల కావటం గమనార్హం.