Begin typing your search above and press return to search.

సబ్బులు, టూత్​ పేస్టుల్లో వాడే రసాయనంతో నరాల బలహీనత..!

By:  Tupaki Desk   |   18 Dec 2020 10:45 AM IST
సబ్బులు, టూత్​ పేస్టుల్లో వాడే రసాయనంతో నరాల బలహీనత..!
X
సబ్బులు, టూత్​పేస్టుల్లో వాడే ఓ రసాయనం ఆరోగ్యానికి చాలా హానికరమని హైదరాబాద్​ ఐఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ట్రైక్లోసాన్ అనే ఓ రసాయన పదార్థాన్ని సబ్బులు, టూత్​పెస్టులు, కాస్మొటెక్స్​లో వాడుతుంటారు. ఈ రసాయనం మనిషి శరీరంలోని నరాలవ్యవస్థను దెబ్బతీస్తుందని.. శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐఐటీ హైదరాబాద్​కు చెందిన అసోసియేట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ అనామిక భార్గవ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఇందుకు సంబంధించిన అంశాలను బ్రిటన్​కు చెందిన ‘కెమోస్పియర్​’ అనే జర్నల్​లో ప్రచురించడంతో దీనికి విశేష ప్రాధాన్యం లభించింది.

సబ్బులు, టూత్​పేస్టులు ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు ఈ రసాయనాన్ని అందులో వాడుతుంటారు. ఈ రసాయనం శరీరంలోని వెళితే చాలా ప్రమాదమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ట్రైక్లోసాన్​ అనే రసాయనం సూక్ష్మజీవులను చంపేస్తుంది. ఇది గనక శరీరంలోని వెళితే నరాల వ్యవస్థ దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

పరిశోధన ఎలా సాగించారు..

ట్రైక్లోసాన్​ మానవశరీరంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకొనేందుకు శాస్త్రవేత్తలు ఈ రసాయనాన్ని జెబ్రా చేపలపై ప్రయోగించారు. అయితే వాటిలో నరాల వ్యవస్థ దెబ్బతిన్నది. జెబ్రా చేపలు, మనిషి శరీరనిర్మాణం ఒకేలా ఉంటుంది. కాబట్టి మనిషి మీద కూడా ఇదే తరహా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రసాయనం వాడితే న్యూరో బిహేవియరల్ ఆల్టరేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి దీని వినియోగాన్ని తగ్గించాలని.. లేదంటే తక్కువ మోతాదులో వాడేలా ఆదేశాలు జారీచేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.