Begin typing your search above and press return to search.
బుద్ధుడు జన్మ స్థలం నేపాలే..స్పష్టం చేసిన ఇండియా!
By: Tupaki Desk | 10 Aug 2020 7:30 PM ISTగౌతమ బుద్ధుడి జన్మస్థలం విషయంలో నెలకొన్న వివాదానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పుల్ స్టాప్ పెట్టింది. బుద్ధుడి జన్మస్థలం నేపాల్ లోని లుంబినీయేనని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు.బుధ్ధుడు, మహాత్ముడు ప్రవచించిన బోధనలు ఈ నాటికీ అనుసరణీయమేనంటూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై నేపాల్ మీడియా వక్రీకరించి చేసిన ప్రచారంలో అర్థంలేదని భారత్ తెలిపింది. గౌతమ బుధ్ధుడు భారతీయుడే అని భారత విదేశాంగ మంత్రి ప్రకటించారంటూ ఆ మీడియా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తీవ్రంగా ఖండించారు.
మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యల సారాంశం అది కాదని, బుద్ధిజం విలువలను భారత్, నేపాల్ రెండూ పాటిస్తున్నాయని ఆయన అన్నారని శ్రీవాత్సవ వివరించారు. బుధ్ధుడు పుట్టింది నేపాల్ లోని లుంబినీలోనే అని తాము కూడా చెబుతున్నామన్నారు.అటు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా జైశంకర్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంపట్ల సైతం శ్రీవాత్సవ నిరసన వ్యక్తం చేశారు. మేము ఏమన్నామో తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. లుంబినీ ప్రాంతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గానూ ఇప్పటికే గుర్తింపు పొందిందని నేపాల్ విదేశాంగ శాఖ గుర్తు చేసింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమ దేశంలో పర్యటించిన వేళ, పార్లమెంట్ లో మాట్లాడుతూ, ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది.