Begin typing your search above and press return to search.
ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందా? చైనా.. నేపాల్ పంచాయితీ.. త్వరలో అధికారిక ప్రకటన
By: Tupaki Desk | 28 Nov 2020 9:00 AM ISTఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగినట్టు సమాచారం. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటికైతే నేపాల్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఎవరెస్ట్ ఎత్తు గతం కంటే ఎంత పెరిగింది.. అనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. నేపాల్, చైనా కలిసి ఈ సంయుక్త ప్రకటన చేయనున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఎవరెస్టు కొత్త ఎత్తుని ప్రకటించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖకు అంగీకారం లభించింది. 2015 భూకంపం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు మారి ఉంటుందని సమాచారం. దీంతో నేపాల్ ప్రభుత్వం 2017లో ఎవరెస్టు ఎత్తును కొలిచే ప్రక్రియ ప్రారంభించింది.
‘మేము ఇప్పటికే ఎవరెస్ట్ ఎత్తును కొలిచాం. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తాం’ అని నేపాల్ భూగర్భశాఖ మంత్రి పద్మ కుమారి చెప్పారు. ఎవరెస్ట్ ఎత్తును ఇప్పటికే భారత్ కొలిచింది. 1954లో మనదేశం చేపట్టిన సర్వే ఆధారంగా ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లు. (29,029 అడుగులు). అయితే ఈ భారత్ చెప్పిన ఎత్తుతో చైనా, నేపాల్ దేశాలు విభేదిస్తున్నాయి. ఎవరెస్ట్‌కు ఉత్తరదిశలో ఉన్న టిబెట్ వైపు నుంచి చైనా ఎత్తును లెక్కగట్టింది. కేవలం రాతి ఎత్తునే అది పరిగణనలోకి తీసుకున్నది.
చైనా చెబుతున్న లెక్కల ప్రకారం (2015) ఎత్తు 8844.04 మీటర్లు. అయితే ఎవరెస్ట్ పైన ఉన్న మంచుపొర కూడా పరిగణనలోకి తీసుకోవాలని నేపాల్ వాదిస్తున్నది. గతంలో ఈ విషయంపై చైనా , నేపాల్ ఓ అంగీకారానికి వచ్చాయి. మంచుపొరను కూడా లెక్కించేందుకు చైనా ఒప్పుకున్నది. దీంతో ఇప్పుడు ఇరు దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నాయి.