Begin typing your search above and press return to search.
కేంద్ర మంత్రి, చరిత్ర కారుడికి మధ్య 'పటేల్ పోస్ట్' చిచ్చు
By: Tupaki Desk | 14 Feb 2020 12:30 PM ISTభారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తొలిసారి జవహర్ లాల్ నెహ్రు నేతృత్వంలోని మంత్రివర్గంలో సర్దార్ వల్లాభాయ్ పటేల్ కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పటేల్ మంత్రి స్థానంపై 1947 నాటి ముచ్చట తాజాగా వివాదాంశంగా మారింది. పటేల్ కు మంత్రివర్గం లో స్థానంపై నెహ్రూ ఇస్టం లేదని.. మంత్రివర్గంలోకి పటేల్ ను తీసుకోరాదని నెహ్రు భావించినట్లు.. అందుకే మొదటి జాబితాలో పటేల్ పేరు లేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ బహిర్గతం చేశారు. ఈ విషయమై తీవ్ర వివాదస్పదమైంది. దీనిపై కాంగ్రెస్ నాయకులతో పాటు చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందించి అది అవాస్తవమని తెలిపారు. ఈ విషయమై కేంద్ర మంత్రి జైశంకర్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలను రామచంద్ర గుహతో పాటు కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేశ్, శశిథరూర్ ఖండించారు.
పటేల్ తో సన్నిహితం గా ఉన్న వీపీ మీనన్ పై నారాయణ బసు పుస్తకం రచించారు. ఆ పుస్తకం చదవడంతో తనకు కొత్త విషయం తెలిసిందని తెలిపారు. `` 1947లో పటేల్ ను మంత్రివర్గంలో తీసుకోరాదని నెహ్రు నిర్ణయించినట్లు ఆ పుస్తకం ద్వారా తెలుసుకున్నా. మొదట రూపొందించిన జాబితాలో ఆయన పేరు లేదు`` అని కేంద్రమంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూసిన చరిత్రకారుడు రామచంద్రగుహ స్పందించి మంత్రి అవాస్తవాలు చెప్పారని తెలిపారు.
`అది అభూత కల్పన. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఆధునిక భారత నిర్మాతల మధ్య విబేధాలు ఉన్నట్లు చిత్రీకరించడం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పని కాదు. బీజేపీ ఐటీ విభాగానికి ఆ పని వదిలేయండి` అని రామచంద్ర గుహ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.
దీనికి కేంద్రమంత్రి స్పందిస్తూ `కొందరు విదేశీ వ్యవహారాల మంత్రులు పుస్తకాలు చదువుతారు. కొందరు ప్రొఫెసర్లకు ఆ మంచి అలవాటు ఉంది. అందువల్ల తాజాగా విడుదలైన ఆ పుస్తకాన్ని చదవాలని సిఫార్సు చేస్తున్నా` అని మంత్రి తెలపగా 1947 ఆగస్టు 1వ తేదీన పటేల్ కు నెహ్రు రాసిన లేఖను బహిర్గతం చేశారు. స్వతంత్ర భారత తొలి మంత్రివర్గంలో చేరాల్సిందిగా నెహ్రూ ఆహ్వానిస్తున్నట్లు లేఖలో ఉంది. తన మంత్రి వర్గం లో పటేల్ మూల స్తంభమని నెహ్రు పేర్కొన్నారు. దయచేసి ఈ లేఖను ఎవరైన జైశంకర్ కు చూపుతారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
కేంద్రమంత్రి జైశంకర్ చేసిన ట్వీట్ల పై కాంగ్రెస్ నీయర్ నాయకులు జైరామ్ రమేశ్, శశిథరూర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా 1947 ఆగస్టు 4వ తేదీన మౌంట్ బాటన్ కు నెహ్రు రాసిన లేఖను విడుదల చేశారు. ఆ జాబితా లో పటేల్ పేరు ఉంది. 2015లో విదేశాంగ కార్యదర్శి కావడానికి ముందు చదివిన పుస్తకాలను మరచి పోవాలని హితవు పలికారు. దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ నాయకుడు జయరామ్ రమేశ్ స్పందించి నెహ్రు ప్రకటనకు మద్దతు ఇచ్చారు.