Begin typing your search above and press return to search.
కిడ్నాప్ ఎపిసోడ్ కు ముందు బెంగళూరులో చర్చలు?
By: Tupaki Desk | 13 Jan 2021 11:28 AM ISTసీఎం కేసీఆర్ బంధువులుగా చెప్పే ప్రవీణ్ రావును ఆయన సోదరుల్ని బోయిన్ పల్లిలో కిడ్నాప్ కు గురి కావటం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పలు ఆసక్తికకర అంశాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే ఈ కిడ్నాప్ ఉదంతంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో విచారణ జరుగుతోంది. కిడ్నాప్ కుట్రకు సంబంధించిన వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కిడ్నాప్ కు జరగటానికి ముందు.. ఈ భూమి వివాదానికి సంబంధించి రాజీ చర్చలు పలుమార్లు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఇష్యూను క్లోజ్ చేయటానికి రెండు వర్గాలకు చెందిన వారు బెంగళూరులో పలుమార్లు రాజీ సమావేశాల్ని నిర్వహించుకున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు సంబంధించి కొందరు పెద్దలు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. మరి.. వారెవరు? అన్న విషయంతో పాటు.. ఆ మధ్యవర్తుల్ని విచారిస్తే.. ఈ వివాదానికి సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
అయితే.. మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని విచారించే ఉద్దేశం పోలీసులకు లేదంటున్నారు. దీనికి కారణం.. భూవివాదం మీద కంటే కూడా కిడ్నాప్ అంశం పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. కిడ్నాప్ కు కారణమైన భూవివాదం.. అసలు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందన్న విషయంతో పాటు.. సదరు భూమి ప్రభుత్వ భూమిగా చెబుతున్న వేళ.. దానిపైనా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. ఈ కేసును డీల్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులు ఏం చేస్తారో చూడాలి.