Begin typing your search above and press return to search.

కొత్త ప్రకటనలో నీరజ్ చోప్రా అద్భుత నటన

By:  Tupaki Desk   |   22 Sept 2021 12:05 PM IST
కొత్త ప్రకటనలో నీరజ్ చోప్రా అద్భుత నటన
X
కాదేది ప్రతిభకు అనర్హం అన్నట్టుగా ఒలింపిక్స్ లో బల్లెం విసిరి ఏకంగా భారత్ కు స్వర్ణాన్ని తెచ్చిపెట్టిన బల్లెం వీరుడు ‘నీరజ్ చోప్రా’ ప్రతిభా పాటవాల గురించి యావత్ దేశం ప్రశంసలు కురిపించింది. ప్రధాని మోడీ నుంచి సామాన్యుల వరకూ అతడిని పొగిడేశారు. అయితే తన ప్రతిభ కేవలం క్రీడల్లోనే కాదు.. యాక్టింగ్ లోనూ ఉందని తాజాగా నీరజ్ చూపించాడు.

ఒలింపిక్ బంగారు పతక విజేత.. ప్రస్తుత యూత్ ఐకాన్ నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఇది కొత్త ఊహించని విషయంలో తన ప్రతిభను నిరూపించుకోవడం విశేషం., జావెలిన్ త్రోలో ఇప్పటికే నంబర్ 1 అని నిరూపించుకున్న నీరజ్ తాజాగా తన నటనా పరాక్రమాన్ని కూడా రుచిచూపించాడు. ఎలా యాక్టింగ్ చేయాలో కూడా అద్భుతంగా చూపించాడు. 23 ఏళ్ల నీరజ్ తాజాగా ‘క్రెడిట్, క్రెడిట్ కార్డ్ మేనేజ్‌మెంట్ ’ సంస్థ కోసం ప్రకటనలో కనిపించాడు. తన యాక్టింగ్ ప్రతిభతో మిలియన్ల మందిని ఆకట్టుకున్నాడు.

రాహుల్ ద్రవిడ్‌ని "ఇందిరానగర్ కా గుండ"గా మార్చినట్లుగా క్రెడ్ సంస్థ ఆ ప్రకటనను ఎంతో వైరల్ చేసింది. ఎందుకంటే శాంతానికి, ఓపికకు నిదర్శనం రాహుల్ ద్రావిడ్. అతడితో సీరియస్ పాత్ర చేయించి అందరినీ ఆకర్షించింది. తాజాగా కొత్త ప్రకటన ఇప్పుడు జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాను విభిన్న అవతారాలలో చూపిచింది.. ఈ ప్రకటన చాలా హాస్యాస్పదంగా తీర్చిదిద్దారు.

ఒలింపిక్ స్టార్ ప్రకటన ఇప్పుడు మీడియాని బాగా ఆకర్షిస్తుంది. నీరజ్ జర్నలిస్ట్, క్యాషియర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఫిల్మ్ మేకర్ మరియు జావెలిన్ త్రోయర్ పాత్రలను పోషించాడు.

ఈ యాడ్ సోషల్ మీడియాలో 2 మిలియన్ వ్యూస్ సాధించింది. 56,000 ‘లైక్‌లు’ సాధించింది. అనేక ప్రశంసల మధ్య, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పోస్ట్‌ను షేర్ చేసి నీరజ్ నటనను ప్రశంసించారు.