Begin typing your search above and press return to search.
వేప అయినా తీరుస్తుందా బెంగ.. క్లినికల్ ట్రయల్స్ లో ఆయుర్వేద మందు
By: Tupaki Desk | 21 Aug 2020 5:00 AM ISTకరోనాపై పోరుకు ఒక్కో దేశం ఒక్కోలా సిద్ధమవుతోంది. ప్రస్తుతం అన్ని దేశాలు వ్యాక్సిన్లు మందుల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా, కొన్ని దేశాల్లో రెండోదశలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత్లో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. మనదేశం సంప్రదాయ ఆయుర్వేదానికి పెట్టింది పేరు. ప్రస్తుతం ఆయుర్వేదంలోనూ కరోనా మందు తయారీ పనులు జరుగుతున్నాయి. ఏఐఐఏ.. నిసార్గ్ హెర్బ్స్ అనే సంస్థతో ఎంవోయూ ఒప్పందం కుదుర్చుకుంది. కరోనాకు అడ్డుకట్ట వేయడంలో వేప ఎంతమేర ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నాయి.
హర్యానా ఫరీదాబాద్ లోని ఈఎస్ఐసీ ఆసుపత్రి వేదికగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు.ఏఐఐఏ డైరెక్టర్ డాక్టర్ తనూజా నేసారి ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్నారు.ఈఎస్ఐసీ ఆసుపత్రి డీన్ డాక్టర్ అసీంసేన్ తో మరో ఆరుగురు వైద్య బృందం భాగస్వామ్యమై పరిశోధన సాగిస్తున్నారు. ప్రస్తుతం 250 మంది పై వేపాకు తో చేసిన మందు తో ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 125 మందికి వేప గుళికలు ఇచ్చి అవి ఎంతమేర పనిచేస్తున్నాయో పరిశీలిస్తున్నారు. 28 రోజుల పాటు ట్రయల్స్ నిర్వహించనున్నారు. తాము సిద్ధం చేస్తున్న వేప మందు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని నిసార్గ్ బయోటెక్ వ్యవస్థాపకుడు, సీఈవో గిరీష్ సోమన్ నమ్మకం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఎన్నో రకాల మందుల్లో ఆయుర్వేద మందుల్లో వేపాకును ఔషధంగా వినియోగిస్తున్నారు. వేపాకు సహజంగానే రోగ నివారణి గా అనాది కాలం నుంచి పేరుంది. అందుకే ఆ చెట్టుకు పూజలు కూడా చేస్తుంటారు. మరి అన్ని ప్రయోజనాలు అందిస్తున్న వేపాకు కరోనా కి కూడా చేపట్టడంలో సాయపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.