Begin typing your search above and press return to search.

నెల్లూరు పెద్దాయనకు నేదురుమల్లి షాక్...?

By:  Tupaki Desk   |   18 Feb 2022 11:30 AM GMT
నెల్లూరు పెద్దాయనకు నేదురుమల్లి  షాక్...?
X
నెల్లూరు జిల్లా గత రెండు ఎన్నికల నుంచి వైసీపీకి గట్టి మద్దతుగా ఉంది. అక్కడ స్వీప్ చేస్తూ వస్తోంది. టీడీపీ బలం ఉన్నా కూడా వైసీపీ వైపు జనం మొగ్గుచూపుతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో పదికి పది సీట్లూ వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఇక ఎంపీ సీటు కూడా వైసీపీ పరం అయింది. ఇంతలా బలమున్న చోట వివాదాలు వర్గ పోరు మాత్రం ఓక్ రేంజిలో ఎపుడూ సాగుతూనే ఉంటాయి.

నెల్లూరు పెద్దాయనగా వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి తాజాగా కొత్త జిల్లాల మీద పెద్ద నోరు చేశారు. ఎవరిని అడిగి కొత్త జిలాలను విభజించారు, దీని వల్ల వెంకటగిరి శాసనసభకు తీవ్ర అన్యాయం అని కూడా ఆయన ఘాటుగా విమర్శించారు.

ఇక నెల్లూరులోనే వెంకటగిరిని కలపాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరసనల్లో ఆనం డైరెక్ట్ గా పాలుపంచుకుంటున్నారు. ఒక విధంగా వైసీపీతో తాడో పేడో తేల్చుకోవడానికి ఆనం రెడీ అయ్యారని అంటున్నారు. ఆనం మీద విమర్శలు చేయవద్దని వైసీపీ అధినాయకత్వం ఇప్పటికైతే సూచనలు ఇచ్చింది. అయితే దాన్ని పక్కన పెట్టి మరీ వైసీపీలో మరో కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాం కుమార్ రెడ్డి పెద్దాయనకు గట్టిగానే షాక్ ఇచ్చేశారు.

మా నాన్న చేరదీయకపోతే మీకు రాజకీయ భవిష్యత్తే లేదని హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ ని ఎత్తుకున్నారు. ఆనం ఫ్యామిలీని తొక్కాలీ అనుకుంటే ఈ రోజు దాకా ఆగాలా, నాడే మీ పొలిటికల్ ఫ్యూచర్ ని ఫుల్ స్టాప్ పడేది అని కూడా రాం కుమార్ రెడ్డి విమర్శించారు. ఆనం నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు అని కూడా మండిపడ్డారు.

ఇక శ్రీ బాలాజీ జిల్లాలో వెంకటగిరిని కలపడం పట్ల ప్రజలు ఎవరూ వ్యతిరేకించడం లేదని కూడా రాం కుమార్ రెడ్డి స్పష్టం చేయడం విశేషం. కేవం ఆనం మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన అలా ఎందుకు ఉన్నారో ఎవరికీ అర్ధం కావడంలేదు అని కూడా సెటైర్లు వేశారు. ఇప్పటికైనా సవ్య దిశగా ఆనం ఆలోచించాలని రాం కుమార్ రెడ్డి చెప్పడం బట్టి చూస్తూంటే ఆనం కి పొగ పెట్టడానికి రాం కుమార్ రెడ్డిని హై కమాండ్ వ్యూహాత్మకంగా రనంలోకి దించిందా అన్నదే చర్చ.

నిజానికి వైసీపీలో మొదట చేరింది రాం కుమార్ రెడ్డే. అయితే ఆనం వంటి పెద్దాయన రావడంతో జగన్ ఆయనకు వెంకటగిరి టికెట్ ఇచ్చి రాం కుమార్ రెడ్డిని సర్దుకోమని చెప్పారని ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి రాం కుమార్ రెడ్డి క్యాండిడేట్ అన్నది ఖాయమని కూడా అంటున్నారు. మొత్తానికి ఆనం కి పొగ మొదలైంది. ఇక నెల్లూరు వైసీపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాల్సిందే.