Begin typing your search above and press return to search.

నెబ్యులైజర్ ఆక్సిజన్ గా పనిచేస్తుందట.. నిజమెంత ?

By:  Tupaki Desk   |   26 April 2021 8:30 AM GMT
నెబ్యులైజర్ ఆక్సిజన్ గా పనిచేస్తుందట.. నిజమెంత ?
X
కరోనా భూతం దేశం పై విరుచుకుపడుతూ విలయం సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ విచ్చలవిడిగా వ్యాపించేసి ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. అయితే, ఈ కరోనా పుణ్యమా అని చేతిలో ఫోన్ మెదడులో కొంత ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఒకో వైద్యుడిలా తయారయిపోయారు. తమకు తోచిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఆక్సిజన్ కొరత అనే సంక్షోభానికి కొందరు సోషల్ మీడియా డాక్టర్లు.. నెబ్యులైజర్ తో చెక్ చెప్పోచ్చంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు నెబ్యులైజర్ కి ఆక్సిజన్ కీ సంబంధం ఏమిటి ... ఆక్సిజన్ కొరత కి నెబ్యులైజర్ తో చెక్ పెట్టొచ్చా అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

అసలు నెబ్యులైజర్ అంటే .. ఒక ద్రవం నుండి చక్కటి పొగమంచును సృష్టించే పరికరం. సాధారణంగా సంపీడన గాలి లేదా ఆక్సిజన్ ఉపయోగించి లేదా అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ ద్వారా పనిచేస్తుంది. ఈ పరికరంలో వేసిన మందు లేదా ఏదైనా ద్రవాన్ని మంచులాంటి పొగలా మార్చే యంత్రం నెబ్యులైజర్. సింపుల్ గా అంటే ఒక మందును ఇంజక్షన్ రూపంలో టాబ్లెట్ రూపంలో ఎలాగైతే తీసుకుంటామో గాలిరూపంలో ఆ మందును తీసుకునేలా చేసే పరికరం నెబ్యులైజర్. ఇది సాధారణంగా ఆస్తమా రోగులకు దానికి సంబంధించిన మందును శాసనాళాల్లోకి గాలిరూపంలో పంపించి వారి ఊపిరిని అడ్డుకుంటున్న పదార్ధాలను చెల్లా చెదురు చేసేలా చేస్తుంది. ఆక్సిజన్ గురించి అందరికీ తెలిసిందే. ఇది ప్రాణవాయువు. ఇది సరిపడిన పరిమాణంలో మనం ముక్కుద్వారా శ్వాసించలేకపోతె ఇబ్బంది తలెత్తుతుంది. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.

దీనిపై ఓ వీడియో చేశారు డాక్టర్ అలోక్ నాద్. ఆ వీడియోలో ఆయన అందులో ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయంగా నెబ్యులైజర్ పని చేస్తుందని చెప్పారు. అయితే, ఇది పూర్తిగా తప్పు అని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఒక నెబ్యులైజర్ ఔషధం యొక్క నిహారికలను అందిస్తుంది అలాగే, వాటిని కొంచెం నెట్టివేస్తుంది. ఇది ఆక్సిజన్ అవసరాన్ని తీర్చదు. వాస్తవానికి, కొన్ని సమయాల్లో, మీరు దానిని ఆక్సిజన్‌తో అనుసంధానించాలి ”అని స్కాట్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ డాక్టర్ అవిరల్ వట్సా అన్నారు.