Begin typing your search above and press return to search.

‘కాగ్’ కడిగియలేదు.. ఏంటబ్బా కిటుకు?

By:  Tupaki Desk   |   14 Feb 2019 5:07 AM GMT
‘కాగ్’ కడిగియలేదు.. ఏంటబ్బా కిటుకు?
X
ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఇలా చేయలేదు. గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్కాంలు, పరిపాలన వైఫల్యాల బాటపట్టినా దేశంలోని స్వతంత్ర వ్యవస్థల జోలికి వెళ్లలేదు. అందుకే ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, కాగ్ వంటి సంస్థలు నిక్కచ్చిగా పనిచేశాయి. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాయి. కానీ ఇప్పుడు తనపై విమర్శలంటేనే సహించని మోడీ.. ఒక్కో వ్యవస్థను ఎంతో చాకచక్యంగా నీరుగారేస్తున్నారన్న విమర్శ ఉంది.

ముఖ్యంగా గుజరాతీలను, తన అనుకూలురను స్వతంత్ర వ్యవస్థలకు అధిపతులుగా నియమిస్తారు. మోడీ ఆడినట్టు ఆడకుండా వాళ్లు నిరసన తెలిపితే తొలగిస్తారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తారు. తన చెప్పు చేతల్లో పెట్టుకుంటారు. ఎక్కడ తమ ప్రభుత్వంపై విమర్శలు రాకుండా మేనేజ్ చేస్తాడు. ఇలా చేస్తుండబట్టే మోడీపై ఈ నాలుగున్నరేళ్ల ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తప్పితే కానీ.. అధికారికంగా బయటపడడం లేదు. రాఫెల్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎంత గొంతు చించుకొని సుప్రీంలో విచారణకు తెప్పించినా చివరకు అఫిడవిట్లతో మేనేజ్ చేశాడంటే మోడీ స్టామినా అర్థం చేసుకోవచ్చు..

ఇక ఇదే రాఫెల్ వివాదంపై కాగ్ కడిగేస్తుందని అంతా భావించారు. కానీ.. ప్చ్ అది సాధ్యం కాలేదు..ఎప్పుడు గడిచిన ఆరేడు దశాబ్ధాల్లో ప్రభుత్వం పాలన వైఫల్యాలపై కడిగేసే ‘కాగ్’ తొలిసారి బీజేపీ ప్రభుత్వానికి అందునా రాఫెల్ యుద్ధ విమానాలపై అనుకూల నివేదికను వెలువరించింది. తెరవెనుక ఏం జరిగిందో తెలియదు.. కానీ యూపీఏ రాఫెల్ పై కుదుర్చుకున్న ధరతో పోలిస్తే 2.86 శాతం తక్కువ ధరకే బీజేపీ కొనుగోలు చేసిందని నివేదిక ఇచ్చింది. కానీ చాలా లొసుగులు ఉన్నాయని మాత్రమే హెచ్చరించింది.

ఇలా ఇన్నేళ్లలో కాగ్ నివేదిక పాజిటివ్ గా రావడం తొలిసారి చూస్తున్నాం.. బీజేపీ మేనేజ్ చేసిందో.. అందులో నిజమెంతో కానీ కాగ్ నివేదికపై దేశంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కాగ్ ను కూడా మోడీ మేనేజ్ చేశాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.