Begin typing your search above and press return to search.
సచిన్.. నీకెందుకయ్యా రాజకీయాలు..! శరద్ పవార్ వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 7 Feb 2021 3:00 PM ISTక్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్‌పై ... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండుల్కర్ క్రికెట్ విషయాలు మాత్రం మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ఇతర విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇటీవల పాపులర్ సింగర్ అమెరికాకు చెందిన రిహాన్నా.. రైతు సమస్యలపై మాట్లాడిన విషయం తెలిసిందే. రైతు సంఘాలకు మద్దతుగా ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఈ ట్వీట్‌పై సచిన్ టెండుల్కర్ స్పందించారు. ‘మా దేశ సమస్యలు మేము పరిష్కరించుకోగలం. వీదేశీ వ్యక్తుల మద్దతు, జోక్యం అవసరం లేదు’ అని అర్థం వచ్చేలా సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశారు. అయితే సచిన్‌పై దేశవ్యాప్తంగా ఓ వర్గం విమర్శలు చేసింది. ఢిల్లీలో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పుడు.. ఇంతకాలంగా రైతులు పోరాటం చేస్తుంటే స్పందించని సచిన్ ఇప్పుడెందుకు స్పందిస్తున్నారంటూ కొందరు సోషల్‌మీడియాలో విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై శరద్‌పవార్ స్పందించారు.
ఇటీవల ఆయన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సచిన్ టెండుల్కర్ క్రికెట్ గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. కానీ ఇతర విషయాలపై స్పందించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి’ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఆందోళనలు చేస్తున్న అన్నదాతలను కొందరు బీజేపీ నేతలు ఖలిస్థాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని కూడా శరద్ పవార్ తప్పుపట్టారు. కేంద్రం రైతు సమస్యలను దారి మళ్లిస్తున్నదని ఆరోపించారు.
పవార్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ ఓ ట్వీట్ చేశారు. ‘శరద్ పవార్ తన సలహాలు సూచనలు విదేశీ సెలబ్రిటీలు మియా ఖలీఫా, రిహాన్న, గ్రేటా థన్బెర్గ్లకు ఇస్తే బాగుంటుంది. శరద్ పవార్ గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఏపీఎంసీతో కలిసి అతడు పనిచేశాడు. సంస్కరణలకు అనుకూలంగా లేఖలు రాశాడు’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
శరద్‌పవార్‌పై నెటిజన్లు కూడా మండిపడ్డారు. విదేశీ మహిళ మరో దేశ సమస్య గురించి మాట్లాడితే తప్పు లేదుకానీ.. మన దేశ క్రికెటర్ మాట్లాడితే తప్పు అయ్యిందా? అంటూ ఓ నెటిజన్ స్పందించారు.